Just SportsLatest News

INDIA VS PAKISTAN : కొలంబో కొల్లగొట్టేస్తారా ? పాక్‌తో మెగాఫైట్‌కు భారత్ రెడీ

INDIA VS PAKISTAN : అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ కొలంబో వేదికగా తలపడబోతున్నాయి

INDIA VS PAKISTAN

ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ లో అసలు సిసలు మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్(INDIA VS PAKISTAN) కొలంబో వేదికగా తలపడబోతున్నాయి. మూమూలుగానే ఇరు జట్లు తలపడుతున్నాయంటే ఎలాంటి ఆసక్తి.. ఎంతటి ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతుండడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది.

పైగా ఆసియాకప్ లో నో షేక్ హ్యాండ్ వివాదం.. ఇప్పుడు బంగ్లాకు మద్ధతుగా బాయ్ కాట్ చేస్తామంటూ పాక్ చేసిన హడావుడి.. మళ్లీ యూటర్న్ తీసుకుని మ్యాచ్ ఆడేందుకు అంగీకరించడం.. ఇలాంటి అంశాలతో ఈ మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి రెట్టింపపోయింది. అదే సమయంలో మ్యాచ్ కు ముందు పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టే కామెంట్లు కూడా చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది.

అభిషేక్ శర్మను ఆడిస్తేనే తమకు మజా ఉంటుందంటూ పాక్ కెప్టెన్ కామెంట్ చేయడం, తన బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెడతానంటూ పాక్(INDIA VS PAKISTAN) వివాదాస్పద స్పిన్నర్ మహ్మద్ తారిఖ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కు ఆటతోనే సమాధానమిచ్చేందుకు భారత్ క్రికెటర్లు సై అంటున్నారు. శనివారం ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేసాయి. కొలంబోలో ఆదివారం వర్షం పడే అవకాశముండడం, పిచ్ పరిస్థితులను అంచనా వేసుకోవడం వంటి అంశాలపైనా ఇరు జట్లు దృష్టి పెట్టాయి.

INDIA VS PAKISTAN)
INDIA VS PAKISTAN)

ఇక తుది జట్ల విషయానికొస్తే భారత్ కు అభిషేక్ శర్మ రీఎంట్రీ బలాన్ని పెంచేదే. అస్వస్థతతో గత మ్యాచ్ కు దూరమైన ఈ యువ ఓపెనర్ ఇప్పుడు ఫిట్ నెస్ సాధించాడు. ప్రాక్టీస్ సెషన్ లో సౌకర్యవంతంగానే కనిపించాడు. దీంతో సంజూ శాంసన్ స్థానంలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అటు కొలంబో పిచ్ ను దృష్టిలో ఉంచుకుని భారత్ ఎక్స్ ట్రా స్పిన్నర్ తో బరిలోకి దిగనుంది. ఈ కారణంగా రింకూ సింగ్ లేదా అర్షదీప్ లలో ఒకరిపై వేటు పడనుంది.

ఈ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ లేదా కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకోనున్నారు. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే అర్షదీప్ ను తప్పించే ఛాన్సుంది. గత మ్యాచ్ లో అర్షదీప్ భారీగా పరుగులిచ్చేశాడు. ఇక పాక్ జట్టులో ఉస్మాన్ తారిఖ్ పైనే అందరి చూపు ఉంది. వివాదాస్పద బౌలింగ్ శైలితో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన తారిఖ్ ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఇక గత రికార్డుల పరంగా భారత్ జట్టుదే పైచేయిగా ఉంది. మెగాటోర్నీలో ఇరు జట్లు 8 సార్లు ఢీకొంటే ఏడుసార్లు టీమిండియానే గెలిచింది.

అటు పిచ్ విషయానికొస్తే బ్యాటర్లకు అనుకూలించినా ఓవరాల్ గా స్పిన్నర్లు కీలకం కాబోతున్నారు. సెకండాఫ్ లో స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచే అవకాశముంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button