Just SportsLatest News

England vs Italy :ఇంగ్లాండ్ ను వణికించిన ఇటలీ.. అతికష్టంతో సూపర్-8 బెర్త్ ఖరారు

England vs Italy : టీ20 ప్రపంచకప్ లో మరో సంచలనం తృటిలో తప్పిపోయింది. పసికూన ఇటలీ ఇంగ్లాండ్ జట్టుకు వణుకు పుట్టించింది.

England vs Italy

టీ20 ప్రపంచకప్ లో మరో సంచలనం తృటిలో తప్పిపోయింది. పసికూన ఇటలీ ఇంగ్లాండ్(England vs Italy) జట్టుకు వణుకు పుట్టించింది. అది కూడా 200కు పైగా టార్గెట్ ను దాదాపుగా ఛేదించినంత పని చేసింది. ఒక దశలో ఇటలీ ప్లేయర్ బెన్ మానెంటి విధ్వంసానికి ఇంగ్లాండ్ కు గుండె ఆగినంత పనైంది. కాస్త అనుభవంతో చివర్లో ఓటమి నుంచి గట్టెక్కింది.

ఈ టోర్నీ ఆరంభం నుంచీ చిన్న జట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ పై ఇటలీ (England vs Italy) కూడా తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబరిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 202 పరుగుల భారీస్కోరు చేసింది. ఒక దశలో 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటకీ…టామ్ బాంటన్, విల్ జాక్స్ మెరుపు బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ భారీస్కోరు చేసింది.

ముఖ్యంగా విల్ జాక్స్ చివర్లో దుమ్మురేపాడు. కేవలం 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. అతనితో పాటు 21 బంతుల్లో 30 (3ఫోర్లు , 1సిక్సర్), సామ్ కరన్ 19 బంతుల్లో 25 పరుగులు చేశారు. విల్ జాక్స్ విధ్వంసంతోనే ఇంగ్లాండ్ స్కోరు 200 దాటగలిగింది.

ఛేజింగ్ లో ఇటలీ కేవలం 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఆంథోని(0) , స్మట్స్ (0) డకౌటవగా.. కెప్టెన్ మానెట్టి 12 పరుగులకే వెనుదిరిగాడు.ఈ పరిస్థితుల్లో బెన్ మానెంటి, గ్రాంట్ స్టివర్ట్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 48 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు.

England vs Italy
England vs Italy

ముఖ్యంగా మానెంటి విధ్వంసం ఓ రేంజ్ లో సాగింది. భారీ సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లవు ఊచకోత కోశాడు. అతను క్రీజులో ఉన్నంతసేపూ ఇంగ్లాండ్ క్రికెటర్లు ప్రేక్షకుల్లా మిగిలారు. బంతి ఎటువైపు వేసినా సిక్సర్లు బాదేస్తుంటే సాధించాల్సిన రన్ రేట్ తగ్గుతూ వచ్చింది. ఇంకో రెండు ఓవర్లు అతను క్రీజులో ఉండుంటే ఇంగ్లాండ్ కు ఖచ్చితంగా భారీ షాక్ తగిలేది. మానెంటి 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. అటు స్టివర్ట్ 45 పరుగులు చేశాడు. మానెంటి ఇన్నింగ్స్ లో 52 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి.

చివరి 3 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి ఉండగా. ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే స్టివర్ట్ , జస్ప్రీత్ సింగ్ వెంటవెంటనే ఔటవడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది. చివరికి ఇటలీ 178 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button