Just SpiritualLatest News

Planetary :ఒకే వరుసలోకి తొమ్మిది గ్రహాలు.. ఆకాశంలో అద్భుతాన్ని అసలు మిస్ అవకండి

Planetary : రెండు లేదా మూడు గ్రహాలు దగ్గరకు రావడం తరచుగా జరుగుతున్నా.. ఆరు నుంచి తొమ్మిది గ్రహాలు ఒకే వరుసలో దాదాపు 90 డిగ్రీల కోణంలో కనిపించడం మాత్రం చాలా అరుదు.

Planetary

ఖగోళ ప్రియులకు ఈ నెల ఫిబ్రవరి 28 ఒక పండగ లాంటి రోజు. ఎందుకంటే సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ కూడా ఒకే వరుసలో అమర్చినట్లుగా కనిపించే అరుదైన దృశ్యం ఆరోజు ఆవిష్కృతం కాబోతోంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ , నెప్ట్యూన్ గ్రహాలతో పాటు మరుగుజ్జు గ్రహమైన ప్లూటో కూడా ఒకే వరుసలోకి రావడమే ఇప్పుడు విశేషం.

ఈ అద్భుతాన్ని వీక్షించాలంటే.. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం సూర్యాస్తమయం అయిన వెంటనే సరైన సమయం అని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. పశ్చిమ దిశలో క్షితిజ సమాంతరంగా చూస్తే బృహస్పతి, శుక్రుడు వంటి ప్రకాశవంతమైన గ్రహాలను.. మనం కంటితోనే డైరక్టుగా చూడొచ్చు. అయితే యురేనస్, నెప్ట్యూన్ , ప్లూటో వంటి దూరంగా ఉండే గ్రహాలను చూడాలంటే మాత్రం మంచి టెలిస్కోప్ లేదా శక్తివంతమైన బైనాక్యులర్స్ అవసరం పడతాయి.

ఇలాంటి గ్రహాల కూటమి (Planetary Alignment) అనేది ప్రతి ఏడాది జరగదు. రెండు లేదా మూడు గ్రహాలు దగ్గరకు రావడం తరచుగా జరుగుతున్నా.. ఆరు నుంచి తొమ్మిది గ్రహాలు ఒకే వరుసలో దాదాపు 90 డిగ్రీల కోణంలో కనిపించడం మాత్రం చాలా అరుదు.

సాధారణంగా ఇన్ని గ్రహాల కూటమి ప్రతి 170 నుంచి 180 ఏళ్లకు ఒకసారి మాత్రమే సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం సాధారణంగా వేరువేరుగానే ఉంటుంది. ఉదాహరణకు, బుధుడు 88 రోజుల్లో ఒక చుట్టూ తిరిగి వస్తే , నెప్ట్యూన్‌కు 165 ఏళ్లు పడుతుంది. ఇలా ఇన్ని గ్రహాలు ఒకే సరళరేఖలో కలవడానికి కొన్ని దశాబ్దాల సమయం పడుతూ ఉంటుంది.

Planetary
Planetary

చివరిసారిగా కొన్ని ప్రధాన గ్రహాలు ఇలా ఒకే వరుసలో దగ్గరగా కనిపించిన ఘటన 1982 మార్చి 10వ తేదీన జరిగింది. ఆ సమయంలో కూడా గ్రహాలన్నీ కూడా సూర్యుడికి ఒకే వైపున 95 డిగ్రీల కోణంలో అమరి ఉన్నాయి. మళ్లీ ఆ స్థాయిలో గ్రహాల పరేడ్ ఇప్పుడు 2026లో ఆవిష్కృతం కానున్నది. అంతకుముందు 2022లో కూడా ఐదు గ్రహాల కూటమిని చూశాం. కానీ ఈ ఫిబ్రవరి 28న జరగబోయేది అంతకంటే చాలా పెద్దది అలాగే అరుదైనది కూడా. మళ్లీ ఇలాంటి పూర్తి స్థాయి గ్రహాల కూటమిని చూడాలంటే మనమంతా 2040 వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

మరోవైపు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ గ్రహాల కూటమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం అయితే ఇది కేవలం అంతరిక్షంలో జరిగే ఒక సహజమైన అద్భుతమైన పరిణామం. పట్టణాల్లో ఉండే లైటింగ్స్ మధ్య కంటే, చీకటిగా ఉండే ప్రదేశాల నుంచి ఆకాశాన్ని గమనిస్తే ఈ ప్లానెటరీ పరేడ్ మరింత క్లారిటీగా, అద్భుతంగా కనిపిస్తుంది.అందుకే ఈ ఫిబ్రవరి 28 రాత్రిని అస్సలు మిస్ కాకండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button