RailOne: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? మార్చి 1 నుంచి రూల్స్ మారుతున్నాయని తెలుసా?
RailOne: రిజర్వేషన్ కోసం ఐఆర్సీటీసీ (IRCTC), జనరల్ టికెట్ల కోసం యూటీఎస్ (UTS) యాప్ వాడే వారు .
RailOne
భారతీయ రైల్వే.. తన ప్రయాణికుల కోసం ఒక మెయిన్ అప్డేట్ను రిలీజ్ చేసింది. రైలులో జనరల్ టికెట్లు లేదా ప్లాట్‌ఫారమ్ టికెట్లు బుక్ చేసుకోవడానికి చాలామంది ఇప్పటి వరకు వాడుతున్న యూటీఎస్(UTS) మొబైల్ యాప్‌కు ఇండియన్ రైల్వే స్వస్తి పలుకుతోంది. మార్చి 1, 2026 నుంచి ఈ పాత అప్లికేషన్ పూర్తిగా పని చేయడాన్నిఆపేస్తున్నారు. దీని స్థానంలోనే రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రైల్ వన్(RailOne) అనే సరికొత్త అప్లికేషన్ అందుబాటులోకి తీసుకు వస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో రైల్వేశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇప్పటి వరకు రైల్వే టికెట్ల కోసం అందరూ రకరకాల యాప్‌లను వాడేవారు. రిజర్వేషన్ కోసం ఐఆర్సీటీసీ (IRCTC), జనరల్ టికెట్ల కోసం యూటీఎస్ (UTS)యాప్ వాడే వారు . అయితే ఇప్పుడు ఇలా కాకుండా ప్రయాణికులకు డిజిటల్ సేవలను ఇంకా ఈజీగా చేయడమే ఈ మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. రైల్ వన్(RailOne) కేవలం టికెట్ బుకింగ్ యాప్ మాత్రమే కాదు, ఇది ఒక ఆల్ ఇన్ వన్ సొల్యూషన్. అందుకే దీనిని రైల్వే సూపర్ యాప్ అని పిలుస్తున్నారు. మార్చి 1 తర్వాత ఎవరైనా యూటీఎస్(UTS) యాప్ ఓపెన్ చేస్తే, వెంటనే రైల్ వన్(RailOne) యాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని సూచించే ఒక సందేశం కనిపిస్తుంది.

ఈ యాప్ వల్ల జనరల్ టికెట్ల కోసంస్టేషన్లలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. సెకన్ల వ్యవధిలో ఈ యాప్ ద్వారా ఈజీగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్లాట్‌ఫారమ్ టికెట్లు, జనరల్ టికెట్లతో పాటు మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు ఈ కొత్త యాప్‌లో అందుబాటులో ఉంటాయి. పాత యాప్‌లోని సాంకేతిక లోపాలను సరిదిద్ది, ప్రయాణికులు ఈజీగా అర్థం చేసుకునేలా దీని డిజైన్ ఉంటుంది. ముఖ్యంగా పాత యాప్‌లోని మీ బ్యాలెన్స్ లేదా బుకింగ్ వివరాలు కూడా కొత్త యాప్‌కు సురక్షితంగా లింక్ చేయబడతాయి .మొత్తంగా డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్న రైల్వే శాఖ, ప్రయాణ అనుభవాన్ని మరింత లేటెస్ట్ వెర్షన్లో అందించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంది.



