Just InternationalJust LifestyleLatest News

Punch Kun Monkey:ఒక్క పంచ్ కున్ కోతిపిల్ల వీడియో..మంకీ ఎమోషన్‌ను ప్రపంచ బ్రాండ్లు ఎలా క్యాష్ చేసుకున్నాయి?

Punch Kun Monkey:సాఫ్ట్ ఎమోషన్‌ గురించి జనాలు మాట్లాడుతూ ఉండగానే .. మరోవైపు కార్పొరేట్ దిగ్గజాలు చేసిన బిజినెస్ స్ట్రాటజీ వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Punch Kun Monkey

సోషల్ మీడియాలో కొన్ని కొన్ని దృశ్యాలు మనకు తెలీకుండా మనల్ని కన్నీళ్లు పెట్టిస్తాయి. ఎంత మర్చిపోదామన్నా గుర్తు చేస్తూ కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి. అచ్చంగా జపాన్‌లోని ఇచికావా సిటీ జూకు చెందిన పంచ్ కున్ అనే మకాక్ కోతి పిల్ల(Punch Kun Monkey) వీడియో విషయంలోనూ అదే జరిగింది.

ఇచికావా సిటీ జూలో తన తల్లి తనను వదిలేయడంతో, ఆ చిన్ని కోతి పిల్ల (Punch Kun Monkey)ఒక ప్లాస్టిక్ బొమ్మను తన అమ్మ అనుకుని గట్టిగా హత్తుకుని తనతోనే గడిపే దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందిని కదిలించాయి. ఫిబ్రవరి 2026 మొదటి వారంలో..ఇచికావా సిటీ జూ సిబ్బంది పోస్ట్ చేసిన ఈ వీడియో.. నిమిషాల్లోనే వైరల్ అయి, జెన్ జీ , ఆల్ఫా తరాలను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సాఫ్ట్ ఎమోషన్‌ గురించి జనాలు మాట్లాడుతూ ఉండగానే .. మరోవైపు కార్పొరేట్ దిగ్గజాలు చేసిన బిజినెస్ స్ట్రాటజీ వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పంచ్ వీడియో ఇలా వైరల్ అయిందో లేదో వెంటనే దిగ్గజ సంస్థ ‘ఐకియా’ (Ikea) వెంటన రంగంలోకి దిగింది. ఆ కోతి పిల్ల హత్తుకున్న పంచ్ ప్లష్ బొమ్మ..తమ కంపెనీ నుంచే రావడంతో మరిన్ని టాయ్‌లను మార్కెట్లోకి తెచ్చేసింది. కేవలం ఆసియా మార్కెట్లోనే ఒక లక్షకు పైగా ఆ బొమ్మలు అమ్ముడవడంతో సుమారు రూ. 10 కోట్లకు పైగా ఆదాయం పొందిందట.

అంతెందుకు కేవలం ఫిజికల్ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా, క్రిప్టో ప్రపంచం కూడా దీన్ని వదిలిపెట్టలేదు. పంచ్ కాయిన్ ($PUNCH) పేరుతో సోలానా బేస్డ్ మీమ్ కాయిన్ లాంచ్ అవ్వగా.. కేవలం ఒక్క రోజులోనే దాని మార్కెట్ విలువ 5 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డాలర్లకు పెరిగింది. దీనికి సెంటిమెంట్‌ను కూడా యాడ్ చేసి ..అమ్మ ప్రేమను కాపాడండి’ అనే స్లోగన్‌తో ఇన్వెస్టర్లను ఆకర్షించింది.

Punch Kun Monkey
Punch Kun Monkey

ఇక ఈ వీడియో సోర్స్ అయిన ఇచికావా సిటీ జూకు..ఆరోజు నుంచ పర్యాటకుల తాకిడి 500 శాతం పెరిగిపోయింది. టికెట్ల రూపంలోనే కాదు..పంచ్ ప్రొటెక్షన్ స్క్వాడ్ పేరుతో ఈ జూ వారు విక్రయించిన టీ-షర్టులు, ఇతర వస్తువుల ద్వారా సుమారు 5 లక్షల డాలర్ల ఆదాయం సమకూరింది.

అంతేకాదు మరోవైపు ప్రముఖులు కూడా తమ వంతు సాయాన్నిపండ్స్ రూపంలో అందించారు. ట్రోన్ వ్యవస్థాపకుడు జస్టిన్ సన్ ఏకంగా రూ. 85 లక్షలు విరాళం ఇవ్వగా, వివిధ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా.. మరో 2 లక్షల డాలర్లు పైనే పోగుపడ్డాయి.ఈ ఫండింగ్‌తో జూ యాజమాన్యం.. పంచ్ కున్ సంరక్షణ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జపాన్ యూజర్ @Volcaholic ద్వారా మొదలైన ఈ పంచ్ కోతి వీడియో వైరల్ ప్రయాణం, చూస్తుండగానే వంద కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగిపోయింది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button