Just SportsLatest News

Suryakumar Yadav : సూర్యాభాయ్ రిటైర్మెంట్ ?..వరల్డ్ కప్ ఫైనల్ తో వీడ్కోలు

Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు సమాచారం

Suryakumar Yadav

ఒకవైపు న్యూజిలాండ్ తో భారత జట్టు ఫైనల్ కు సిద్ధమవుతుంటే మరోవైపు ఒక సంచలన వార్త వైరల్ గా మారింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఆదివారం జరగబోయే టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత సూర్యకుమార్ వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. కెప్టెన్సీ పరంగా ఆకట్టుకుంటున్నా వ్యక్తిగత ఫామ్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి దీనిపై సూర్య నుంచి ఎలాంటి స్పందనా లేదు. అయితే భారత క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయంగా అతను భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉండడం కూడా మరొక కారణంగా చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా సూర్యకుమార్ కేవలం టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు.

2023 వన్డే ప్రపంచకప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ కు దూరమైన స్కై తన కెరీర్ లో కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే రోహిత్ , కోహ్లీ, జడేజా పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. రోహిత్ స్థానంలో టీ20 జట్టు పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) టీమిండియాను అద్భుతంగా నడిపించాడు. సూర్య సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు.

ఇప్పుడు ఆదివారం జరిగే ఫైనల్లో జట్టును గెలిపిస్తే టీమిండియాకు ప్రపంచకప్ అందించిన సారథుల జాబితాలో సూర్య కూడా ఎంట్రీ ఇస్తాడు. కప్ గెలిచినప్పుడు ఉండే సంతోషం మధ్య వీడ్కోలు పలికేందుకు ఇంతకుమించిన సందర్భంగా ఏముంటుందన్నది కూడా చాలా మంది చెబుతున్న మాట.

Suryakumar Yadav
Suryakumar Yadav

ఫామ్ తగ్గడం , వయసు మీద పడడం, అంతర్జాతీయ కెరీర్ చివరి దశలో ఉన్నాడన్న విషయం సూర్యకు తెలుసు. ఇదిలా ఉంటే భారత జట్టు ఫైనల్లో ఓడినా కూడా సూర్యకుమార్ కెరీర్ ముగిసినట్టే. ఎందుకంటే అతనిపై సెలక్టర్లు వేటు వేయడం ఖాయమని భావిస్తున్నారు. 2028లో జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్ పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టునే సిద్ధం చేయనున్నారు.

అప్పుడు సూర్యకుమార్ కు ప్లేస్ ఉండదనేది అంగీకరించాల్సిందే. అందుకే ఈ ప్రపంచకప్ తోనే సూర్యకుమార్ కెరీర్ ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అది వరల్డ్ కప్ ట్రోఫీతోనా లేక ఓటమితోనా అనేది ఆదివారం తేలిపోతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button