Just EntertainmentLatest News

Allu Cinemas: ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్.. అల్లు సినిమాస్ స్పెషల్ ఏంటి?

Allu Cinemas: మామూలు స్క్రీన్లతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ బ్రైట్ నెస్‌తో ఉంటుంది. కలర్స్ కూడా చాలా సహజంగా, కళ్లకు అద్దినట్టు కనిపిస్తాయి.

Allu Cinemas

హైదరాబాద్ అంటేనే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనుకుంటారు మూవీ లవర్స్. ఇక్కడ ఆడియన్స్ మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తారన్న నేమ్ బాగా ఉంది. ఇప్పటి వరకూ ఇలాంటి వారంతా ప్రసాద్ ఐమ్యాక్స్ గురించి మాట్లాడుకునేవాళ్లు. కానీ వీరి ఫేవరేట్ స్పాట్ లిస్టులో ఇప్పుడు కోకాపేట్‌లోని అల్లు సినిమాస్(Allu Cinemas) చేరిపోయింది.

ఎందుకంటే ఇక్కడ ఉన్న డాల్బీ సినిమా స్క్రీన్ మామూలు స్క్రీన్ కంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అసలు ఈ స్క్రీన్‌లో మూవీ చూడటం అంటే.. కేవలం సినిమా చూడటం మాత్రమే కాదు, ఆ మూవీలో ఆడియన్స్ కూడా ఒక భాగం అయిపోతారు. అంటే అంత గొప్ప అనుభవాన్ని ఇది ఇస్తుంది.

దీనిలో డ్యూయల్ 4K లేజర్ ప్రొజెక్షన్ వాడటం.. దీని మరో స్పెషాలిటీ . అంటే మామూలు స్క్రీన్లతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ బ్రైట్ నెస్‌తో ఉంటుంది. కలర్స్ కూడా చాలా సహజంగా, కళ్లకు అద్దినట్టు కనిపిస్తాయి. ఇక సౌండ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే.. అది ఒక 360 డిగ్రీల ప్రపంచం అనే చెప్పాలి.

అంటే మూవీలో పైనుంచి హెలికాప్టర్ వెళ్తున్నా, వర్షం పడుతున్నా అది మన పక్కనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. దీనిలో 64 స్పీకర్లు, 128 ఆడియో ట్రాక్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, సౌండ్ చాలా అంటే చాలా పవర్ ఫుల్ గా, క్లియర్‌గా వినిపిస్తుంది. దీనిలో సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి.

Allu Cinemas
Allu Cinemas

తాజాగా జర్నలిస్టుల కోసం స్పెషల్‌గా ప్రదర్శించిన రామాయణ (రణబీర్ కపూర్, సాయి పల్లవి) గ్లింప్స్ చూసిన వారంతా షాక్ అయ్యారు. ఆ 3D విజువల్స్, ఆ సౌండ్ క్వాలిటీ హాలీవుడ్ రేంజ్‌ ప్రమాణాలతో ఉంది. ఈ స్క్రీన్ వెడల్పు 75 అడుగులు ఉంటుంది, ఇది ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ కావడం మరో విశేషం.

థియేటర్ కెపాసిటీ 634 సీట్లు కాగా, మొత్తం 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్ లెట్స్ ఈ అల్లు సినిమాస్‌(Allu Cinemas)లో ఉన్నాయి. అంటే ఎక్కడ కూర్చున్నా ఒకే రకమైన అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ ఒక్కసారి మూవీ చూస్తే, మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించేలా ఈ మల్టీప్లెక్స్‌ని డిజైన్ చేశారు. మొత్తంగా అల్లు అర్జున్ తన సినిమాల్లో ఏ స్టైల్ మెయింటెయిన్ చేస్తారో, ఈ థియేటర్‌లో కూడా అదే స్టైల్, క్వాలిటీని మెయింటైన్ చేశారంటూ బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button