Just SportsLatest News

Rohit Sharma : హిట్‌మ్యాన్ ధనాధన్…రోహిత్ ప్రాక్టీస్ షురూ

Rohit Sharma : రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చాడు. మాల్దీవుల్లో వెకేషన్ ముగించుకున్న హిట్ మ్యాన్ నేరుగా వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు

Rohit Sharma

ఐపీఎల్ 2026 సీజన్ కు అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. పలువురు స్టార్ ప్లేయర్స్ కూడా రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా కుటుంబంతో గడిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చాడు. మాల్దీవుల్లో వెకేషన్ ముగించుకున్న హిట్ మ్యాన్ నేరుగా వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

ముంబై ప్రధాన బౌలర్లందరి బౌలింగ్ లోనూ భారీ షాట్లు కొడుతూ ప్రాక్టీస్ చేశాడు. తర్వాత సహచర ఆటగాళ్ళతో కలిసి ఫీల్డింగ్ చేసిన రోహిత్ మంచి జోష్ లో కనిపించాడు. మొన్నటి వరకూ టీ20 ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ గా సందడి చేసిన హిట్ మ్యాన్ ఫ్యామిలీతో వెకేషన్ ను ఆస్వాదించాడు. మాల్దీవుల్లో తన కుటుంబంతో సరదాగా గడిపాడు.

దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ పర్యటను ముగించుకుని ముంబైకి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ(Rohit Sharma) ఎంఐ ట్రైనింగ్ క్యాంపులో జాయినయ్యాడు. ఫ్యామిలీతో కలిసి వచ్చిన రోహిత్ కు ఘనస్వాగతం లభించింది. టీమ్ ఫోటో షూట్ లో పాల్గొన్న అనంతరం నేరుగా నెట్ ప్రాక్టీస్ కు హాజరయ్యాడు. హెడ్ కోచ్ మహేళ జయవర్థనే ఆధ్వర్యంలో సాధన చేశాడు.

గత సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున 15 మ్యాచ్ లలో 418 పరుగులు చేసిన రోహిత్ ఈసారి కూడా అదే ఫామ్ కొనసాగించాలని ఎదురుచూస్తున్నాడు. 2025 సీజన్ లో ముంబైని ప్లే ఆఫ్స్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత హార్థిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతున్న రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్నాడు.

Rohit Sharma
Rohit Sharma

ఈ సీజన్ లోనూ హిట్ మ్యాన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఉపయోగించుకోవాలని ముంబై భావిస్తోంది. గత సీజన్ ఆద్యంతం అద్భుతమైన హిట్టింగ్ తో మెరుపు ఆరంభాలను ఇచ్చిన రోహిత్ ముంబై విజయాల్లో కీలకంగా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో 6 వేలకు పైగా పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా ఘనత సాధించిన రోహిత్ తన కెప్టెన్సీలో ముంబైని ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపాడు.

అయితే ముంబై మాత్రం ప్లే ఆఫ్స్ దాటలేకపోయింది. ఆరో టైటిల్ పై కన్నేసిన ముంబై ఇండియన్స్ ఈ సారి వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ సీజన్ తమ తొలి మ్యాచ్ లో ముంబై మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా కోల్ కత్తా నైట్ రైడర్స్ తో తలపడుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button