Silver and Gold:పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త..మరింత తగ్గిన వెండి, బంగారం ధరలు
Silver and Gold: సిల్వర్ ధరలు కిలోకు ఏకంగా 28 వేల రూపాయల వరకు తగ్గడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు జ్యువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు.
Silver and Gold
ఇప్పుడు దేశవ్యాప్తంగా శుభకార్యాల సందడి మొదలవడంతో.. బంగారం, వెండి ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్ వచ్చింది. కొద్దిరోజులుగా అప్ డౌన్ అవుతున్న పసిడి ధరలు ఈరోజు ఒక్కసారిగా మరింత కిందికి దిగివచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న మార్పులు, డాలర్ విలువలో ఒడిదుడుకుల వల్ల దేశీయంగా పుత్తడి ధరలు భారీగా పతనమయ్యాయి. వారం వ్యవధిలోనే తులం పసిడిపై దాదాపు 9 వేల రూపాయల వరకు కోత పడటం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ ధరలు.. కొనుగోలుదారులకు బాగా అందుబాటులోకి వచ్చినట్లు అయింది. అంతేకాదు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర కూడా గణనీయంగా తగ్గింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నా.. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో పాటు అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గడం వంటి రీజన్స్ ఈ బంగారం ధరల పతనానికి ప్రధాన బలంగా నిలిచాయి.

కేవలం గోల్డ్ మాత్రమే కాదు, సిల్వర్(Silver and Gold) కూడా అదే బాట పట్టింది. కిలోపై భారీగానే ధర తగ్గడంతో దుకాణాలు మళ్లీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సిల్వర్ ధరలు కిలోకు ఏకంగా 28 వేల రూపాయల వరకు తగ్గడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు జ్యువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు.
సాధారణంగా మేకింగ్ ఛార్జీలు , జీఎస్టీ (GST) వంటివి అదనంగా ఉన్నా సరే, బేస్ ప్రైస్ తగ్గడం వల్ల కొనేవారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముందు ముందు రోజుల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో,గోల్డ్ అండ్ సిల్వర్(Silver and Gold) ధరలు పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. అలాంటివారంతా ఇప్పుడే కొనడం మంచిదన్న అభిప్రాయంతో బంగారం, వెండిని కొనడానికి క్యూ కడుతున్నారు.





