Just SportsLatest News

IPL : 15 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు..తెలుగు రాష్ట్రంలో ఎక్కడో తెలుసా ?

IPL : ఐపీఎల్ వస్తుందంటే చాలు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్.. ఒక్క మాటలో చెప్పాలంటే వేసవి అంతా వారికి పండగే

IPL

ఐపీఎల్ వస్తుందంటే చాలు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్.. ఒక్క మాటలో చెప్పాలంటే వేసవి అంతా వారికి పండగే. తాము అభిమానించే స్వదేశీ, విదేశీ ప్లేయర్స్ ఆటను చూసేందుకు స్టేడియాలకు ఫ్యాన్స్ క్యూ కడతారు. ముఖ్యంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్ల మ్యాచ్ లకు స్టేడియాలు హౌస్ ఫుల్ అయిపోతాయి.

అందరికీ టికెట్లు దొరకడం కష్టమే. ఒకవిధంగా టికెట్ల కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంటుంది. అయితే టికెట్లు దొరక్క నిరాశ చెందే అభిమానుల కోసం బీసీసీఐ ప్రతీ ఏడాది పలు నగరాల్లో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా వారాంతాల్లో ఈ ఫ్యాన్ పార్క్స్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటవుతుంటాయి. ఇక్కడ భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ఐపీఎల్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

దానితో పాటు మ్యూజిక్, ఫుడ్ కోర్టులు, గేమ్స్ , ఫ్యాన్ యాక్టివిటీస్ వంటి వినోదాలు ఉంటాయి. 2015 నుంచి బీసీసీఐ ఆ ఫ్యాన్ పార్కులకు శ్రీకారం చుట్టింది. ప్రతీ ఏడాది వీటికి ఆదరణ పెరుగుతుండడంతో ఎప్పటికప్పుడు నగరాల సంఖ్యను పెంచుకుంటూ వీటిని ఏర్పాటు చేస్తోంది. ఈ సారి ఐపీఎల్(IPL)19వ సీజన్ కోసం దేశవ్యాప్తంగా 15 నగరాల్లో ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలోని నలుమూలలు కవర్ అయ్యేలా నగరాల జాబితాను బీసీసీఐ సిద్ధం చేసింది.

IPL
IPL

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క నగరం చోటు దక్కించుకుంది. తెలంగాణలోని నిజామాబాద్‌ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ గ్రౌండ్స్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. తొలి వీకెండ్‌లో మార్చి 28, 29 తేదీల్లో.. రోహ్తక్, భోపాల్, నాగ్‌పూర్, తుమకూరు, కృష్ణనగర్ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

తర్వాత ఏప్రిల్ 4, 5 తేదీల్లో మథుర, జోధ్‌పూర్, నిజామాబాద్, మైసూర్, భువనేశ్వర్ నగరాల్లో ఫ్యాన్ పార్కులు ఉంటాయి. ఇక చివరి వారాంతం ఏప్రిల్ 11, 12 తేదీల్లో మీరట్, నడియాద్, రత్నగిరి, కోయంబత్తూరు, రూర్కెలా నగరాల్లో ఫ్యాన్ పార్క్స్ ఏర్పాటు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.

ఈ సారి ఐపీఎల్(IPL) షెడ్యూల్ ను రెండు విడతల్లో రిలీజ్ చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తొలి దశలో 20 రోజులకు సంబంధించిన షెడ్యూల్ ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. ఇటీవలే ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రావడంతో తర్వాతి ఐపీఎల్ షెడ్యూల్ పై బీసీసీఐ కసరత్తు చేస్తోంది.

Pakistan : పాక్ వస్తే లేపేస్తాం..విదేశీ ప్లేయర్స్ కు బెదిరింపులు

Related Articles

Back to top button