Just EntertainmentLatest News

Actress Raasi : ప్రభాస్ కు అమ్మగా చేయలేను…మేడమ్ అని పిలిపించుకుంటా

Actress Raasi : టాలీవుడ్ డార్లింగ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ప్రభాస్ అంటే అభిమానులకే కాదు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు ఇష్టం

Actress Raasi

టాలీవుడ్ డార్లింగ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ప్రభాస్ అంటే అభిమానులకే కాదు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు ఇష్టం.. ఇంకా చెప్పాలంటే పాత హీరోయిన్లు, కొత్త హీరోయిన్లు అనే తేడా లేదు అందరికీ డార్లింగ్ అంటే చాలా క్రష్. అందుకే ఎవరితో కలిసి నటించాలని ఉందంటే చాలామంది తమ వయసుతో సంబంధం లేకుండా ప్రభాస్ పేరే చెబుతుంటారు.

తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశి(Actress Raasi) కూడా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తే అన్న ప్రశ్నకు స్పందించారు. డార్లింగ్ మూవీలో అవకాశం దొరికితే ఏ క్యారెక్టర్ చేస్తానో కూడా చెప్పేశారు. దీనికి సంబంధించి రెండు కండీషన్స్ పెట్టారు. యంగ్ హీరోలు, సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా చేసానని, కానీ ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఇక అవకాశం రాదన్నారు.

ఆ కల తీరదనీ, అయితే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే వదులుకోనని చెప్పారు. భవిష్యత్తులో ప్రభాస్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే మేడమ్ అని పిలిపించుకుంటా తప్ప అమ్మా అని పిలిపించుకోనని చెప్పారు. అంటే ప్రభాస్ కు అమ్మగా నటించలేనంటూ తేల్చి చెప్పారు.

తమ ఇద్దరి వయసు ఒకటేనని, ప్రభాస్ కి తల్లిగా నటించడం ఇష్టం లేదని అసలు సంగతి చెప్పుకొచ్చారు. అలాగే అక్క, వదిన లాంటి పాత్రలు కూడా ఆయన పక్కన చేయలేనంటూ చెప్పారు. ఇప్పటివరకూ ప్రభాస్ ని కలవలేదనీ, అయితే మిర్చి, రాధే శ్యామ్ సినిమాల్లో ప్రభాస్ కి తల్లిగా నటించిన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పానంటూ రాశి గుర్తు చేసుకున్నారు.

Actress Raasi
Actress Raasi

బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి తర్వాత హీరోయిన్ గా సందడి చేసిన రాశికి(Actress Raasi) తెలుగులో పలు చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. శుభాకాంక్షలు, గోకులంలో సీత వంటి సినిమాలతో ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పుడప్పుడూ గ్లామర్ పాత్రల్లోనూ కూడా మెరిసిన రాశి దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు.

మొత్తం 200కు పైగా సినిమాల్లో నటించిన రాశి..రీసెంట్ గా ఓ ఇంటర్యూలో ప్రభాస్ గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ని చూసినప్పుడే భవిష్యత్ లో స్టార్ హీరో అవుతారని అనుకున్నట్టు, తన సోదరుడితో కూడా ఇదే మాట చెప్పిన విషయాన్ని రాశి పంచుకున్నారు. ఇదిలా ఉంటే రాశి ప్రస్తుతం సీరియల్స్, ఇంటర్యూలు, ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు.

Lockdown:మళ్లీ లాక్‌డౌన్ తప్పదా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌పై పడుతున్న ప్రభావం ఎంత?

Related Articles

Back to top button