Just SportsLatest News

Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ పంజా..చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్

Rajasthan Royals : ధోనీ లేని చెన్నై తేలిపోయింది. గత సీజన్ ఫ్లాప్ షోనే కొనసాగిస్తూ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయి సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ రాజస్థాన్ సునాయాస విజయాన్ని అందుకుని సీజన్ లో బోణీ కొట్టింది

Rajasthan Royals

ధోనీ లేని చెన్నై తేలిపోయింది. గత సీజన్ ఫ్లాప్ షోనే కొనసాగిస్తూ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) చేతిలో చిత్తుగా ఓడిపోయి సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ రాజస్థాన్ సునాయాస విజయాన్ని అందుకుని సీజన్ లో బోణీ కొట్టింది.టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

కాగా సీఎస్కే చరిత్రలో తొలిసారి ధోనీ, జడేజా, రైనా ఆ ముగ్గురూ లేకుండా బరిలోకి దిగింది. రాజస్థాన్ పేసర్లు ఆర్చర్, బర్గర్ చెరొక ఎండ్ నుంచీ చెలరేగిపోవడంతో సీఎస్కే బ్యాటర్లు చేతులెత్తేశారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్ చెన్నై తరపున అరంగేట్రంలో నిరాశపరివాడు. కేవలం 6 పరుగులకే వెనుదిరిగాడు.

రాయల్స్ పేసర్ల ధాటికి చెన్నై ప్రధాన బ్యాటర్లెవ్వరూ నిలవలేకపోయారు. గైక్వాడ్ (6), మాథ్యూ షార్ట్ (2), సర్ఫరాజ్ ఖాన్ (17), కార్తీక్ శర్మ (18) పరుగులకే వెనుదిరిగారు. వరల్డ్ కప్ లో అదరగొట్టి శివమ్ దూబే కూడా ఫెయిలయ్యాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 82 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. సీఎస్కే పాతా బౌలర్ జడేజా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు.

కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనుకుంటున్న దశలో జేమీ ఓవర్టన్ కీలక ఇన్నింగ్స్ ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఓవర్టన్ మెరుపులు కారణంగానే చెన్నై స్కోరు 120 దాటగలిగింది. చివరికి సీఎస్కే 19.4 ఓవర్లలో 117 పరుగులకు అలౌటైంది. రాజస్థాన్ బౌలర్లతో ఆర్చర్ 2, బర్గర్ 2, జడేజా 2 వి తీశారు.

Rajasthan Royals
Rajasthan Royals

128 పరుగుల లక్ష్యఛేదనలోసీఎస్కే బౌలర్లు అద్భుతాలేమీ చేయలేకపోయారు. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడ్డాడు. తన సహజశైలి బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. గత సీజన్ తో ఐపీఎల్ అరంగేట్రం చేసి రెచ్చిపోయిన ఈ చిచ్చర పిడుగు ఈ మ్యాచ్ లేనూ దుమ్మురేపాడు.

బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 15 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. అటు జైశ్వాల్ కూడా దూకుడుగా ఆడడంతో రాజస్థాన్(Rajasthan Royals) పవర్ ప్లేలోనే 74 పరుగులు చేసింది. వైభవ్ 17 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేసి ఔటవగా.. జైశ్వాల్ 38 రన్స్ చేశాడు. ధృవ్ జురెల్ (18), పరాగ్ (14 నాటౌట్) రాజస్థాన్ విజయాన్ని పూర్తి చేశారు. వైభవ్ విధ్వంసంతో రాయల్స్ 12.1 ఓవర్లలోనే మ్యాచ్ ను ఫినిష్ చేసింది.

Live for Yourself: లోకం మెచ్చే బతుకు కాదు.. నీ కోసం నువ్వు జీవించడం మర్చిపోకు

Related Articles

Back to top button