Just SportsLatest News

DC vs LSG : పంత్ కు పరీక్ష…ఢిల్లీతో తలపడున్న లక్నో

DC vs LSG : ఐపీఎల్ 19వ సీజన్ లో ఇంకా అసలైన జోష్ కనిపించడం లేదు. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లలో ఉత్కంఠగా సాగిన మజా అయితే లేదు

DC vs LSG

ఐపీఎల్ 19వ సీజన్ లో ఇంకా అసలైన జోష్ కనిపించడం లేదు. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లలో ఉత్కంఠగా సాగిన మజా అయితే లేదు. 8 జట్లు తలపడగా.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్(DC vs LSG) మ్యాచ్ తో అన్ని జట్లు తమ తొలి మ్యాచ్ ను ఆడినట్టవుతుంది. ఏక్నా స్టేడియం వేదికగా బుధవారం ఢిల్లీ, లక్నో తలపడబోతున్నాయి.

ఈ సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్ కెప్టెన్సీకి పరీక్షగా చెప్పొచ్చు. అటు బ్యాటర్ గా కూడా ఈ సీజన్ పంత్ కు కీలకం కాబోతోంది. టీమిండియాలో రోజురోజుకూ పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నిలకడగా రాణించకుంటే ప్లేస్ ఉండదు. పంత్ కూడా ఈ ఐపీఎల్ లో పరుగుల వరద పారిస్తే తప్ప భారత జట్టులో ప్లేస్ సుస్థిరం కాదు.

2025 సీజన్ లో పంత్ 269 పరుగులు చేయగా.. దీనిలో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ సారి దానికి మించిన ప్రదర్శన చేయడంతో పాటు జట్టును సమర్థవంతంగా నడిపించాల్సి ఉంటుంది. గత సీజన్ లో లక్నో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది.

మిఛెల్ మార్ష్ , మార్క్ రమ్ టాపార్డర్ లో కీలక ఆటగాళ్లుగా చెప్పొచ్చు. అలాగే ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పే నికోలస్ పూరన్ లాంటి ప్లేయర్ ఉండడం అడ్వాంటేజ్. అయితే లక్నో మిడిలార్డర్ మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. ఆయుశ్ బదోనీ, రఘువంశీ, అబ్దుల్ సమద్ ఎంతవరకూ రాణిస్తారో చూడాలి. అటు బౌలింగ్ లో మాత్రం లక్నో పేస్ ఎటాక్ స్ట్రాంగ్ గా ఉంది.

మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ లాంటి స్వదేశీ పేసర్లతో పాటు అన్రిచ్ నోర్జే లాంటి విదేశీ పేసర్ కూడా జట్టులో ఉన్నాడు. ఇక స్పిన్ విభాగంలో నోట్ బుక్ సెలబ్రేషన్స్ తో వైరల్ గా మారిన దిగ్వేష్ రాఠీపైనే లక్నో ఆశలు పెట్టుకుంది.

DC vs LSG
DC vs LSG

దిగ్వేష్ గత సీజన్ లో బంతితో అదరగొట్టినా వివాదాస్పద సెలబ్రేషన్స్ తో జరిమానాకు గురయ్యాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్(DC vs LSG) గత సీజన్ లో లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది. ఇప్పటి వరకూ టైటిల్ గెలవని ఆ జట్టు కొత్త సీజన్ ను ఘనవిజయంతో ఆరంభించాలని ఎదురుచూస్తోంది.

అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్(DC vs LSG) ఈ సారి సమతూకంగా కనిపిస్తోంది. టాపార్డర్ లో కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ప్లేయర్ ఉండడం అతిపెద్ద బలం. గత సీజన్ లో రాహుల్ సూపర్ ఫామ్ తో చెలరేగిపోయాడు. 13 మ్యాచ్ లలో 149కు పైగా స్ట్రైక్ రేట్ తో 539 పరుగులు చేశాడు. రాహుల్ కు జోడీగా పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. అలాగే కరుణ్ నాయర్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్ లాంటి హిట్టర్ల నుంచి ఢిల్లీ భారీ ఇన్నింగ్స్ లు ఆశిస్తోంది.

వీరితో పాటు అభిషేక్ పోరెల్ పైనా అంచనాలున్నాయి. గత సీజన్ లో పోరెల్ 300కు పైగా పరుగులు చేశాడు. ఫినిషర్ రోల్ లో రిజ్వీ, అశుతోష్ శర్మలలో ఒకరికి చోటు దక్కొచ్చు. బౌలింగ్ లో నటరాజన్, అకిబ్ నబీతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పై ఢిల్లీ ఆశలు పెట్టుకుంది.

Dimple Hayathi : బాలయ్యతో డింపుల్…క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Related Articles

Back to top button