Just InternationalJust PoliticalLatest News

Trump :రెండు వారాలు కాల్పుల విరమణ…సంచలన ప్రకటన చేసిన ట్రంప్

Trump : పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నుంచి ప్రపంచ దేశాలకు తాత్కాలిక ఉపశమనం లభించింది

Trump

పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నుంచి ప్రపంచ దేశాలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఇరాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ గత 24 గంటలుగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు నిర్ణయించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవాలన్న షరతుపైనే రెండు వారాలు దాడులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ పోస్టులో వెల్లడించారు. అటు వైట్ హౌస్ కూడా దీనిని ధృవీకరించింది.. మరోవైపు ఇరాన్ కూడా ట్రంప్(Trump) ప్రకటనపై స్పందించింది. వెంటనే హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్టు ప్రకటించింది.

రెండు వారాలపాటు హర్మూజ్‌ తెరుస్తామనీ ఇరాన్ సుప్రీం నేతలు స్పష్టం చేశారు. హర్మూజ్‌కు అవతల ఉన్న నౌకలను భద్రంగా జలసంధి దాటిస్తామన్నారు. తమ 10 పాయింట్ల ప్రతిపాదనకు అమెరికా అంగీకరించిందనీ వెల్లడించారు.

ఇరాన్ నుంచి 10 పాయింట్ల శాంతి ప్రతిపాదన తమకు అందిందని.. దీర్ఘకాలిక శాంతి ఒప్పందం దిశగా చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటించారు. కాగా ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదన చూస్తే భవిష్యత్తులో ఇరాన్ భూభాగంపై ఎలాంటి దాడులు చేయబోమని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి.

Trump
Trump

గల్ఫ్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలి.మిత్రపక్షాలపై దాడులు చేయకుండా ఉండాలి.ఇరాన్‌పై ఉన్న అన్ని రకాల ఆర్థిక ఆంక్షలు పూర్తిగా రద్దు చేయాలి.హర్మూజ్ జలసంధి నియంత్రణ ఇరాన్ వద్దే ఉంటుంది.హార్మూజ్ లో వసూలు చేసిన నిధులు ఇరాన్, ఒమన్ దేశాలు పంచుకుంటాయి.వీటిని ఆ దేశాల పునర్నిర్మాణ పనులకు ఉపయోగిస్తారు.

యుద్ధం కారణంగా  జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం ఇవ్వాలి.బ్యాంకుల వద్ద ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులు వెంటనే విడుదల చేయాలి.కాల్పుల విరమణ తాత్కాలికంగా కాకుండా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలి. ట్రంప్ తాజా ప్రకటనతో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా వీడినప్పటికీ… రాబోయే రెండు వారాల్లో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

Thieves : నమ్మితే నట్టేట ముంచేస్తున్నారా? బంధువుల్లో, స్నేహితులలో దొంగలు ఎందుకు ఉంటారు?

Related Articles

Back to top button