Ram Charan: రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ లాక్.. బాక్సాఫీస్ వద్ద మెగా వేట మొదలయ్యేది అప్పుడేనా?
Ram Charan: ముందుగా జూన్ మొదటి వారంలోనే ఈ మూవీ వస్తుందని వార్తలు జోరుగా వినిపించాయి. కానీ టెక్నికల్ వర్స్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే రిలీజ్ విషయంలో మేకర్స్ కొద్దిగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
Ram Charan
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది మూవీకి సంబంధించిన సూపర్బ్ న్యూస్.. ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్‌తో సాగే ఒక ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీపై మొదటి నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి.
లేటెస్ట్ వార్త ప్రకారం పెద్ది సినిమా జూన్ నెలలో బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అవుతోంది. రామ్ చరణ్ (Ram Charan) కెరీర్‌లోనే ఇది ఒక డిఫరెంట్ ప్రయత్నం కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
సినిమా షూటింగ్ విషయానికి వస్తే, ఇప్పటికే షూటింగ్ సుమారు చివరి దశకు చేరుకుంది. ఒక్క పాట తప్ప మిగిలిన సినిమా అంతా పూర్తయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ లాస్ట్ పాటను కూడా సూపర్ గ్రాండ్‌గా తెరకెక్కించే పనిలో ఉంది మూవీ యూనిట్.
బుచ్చిబాబు సానా తన మార్క్ ఎమోషన్స్‌ను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌కు జోడించి ఈ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్(Ram Charan) కూడా ఈ రోల్ కోసం తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుని ఎంతో కష్టపడ్డారని, ఇది చెర్రీ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.

ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ విషయానికి వస్తే, ముందుగా జూన్ మొదటి వారంలోనే ఈ మూవీ వస్తుందని వార్తలు జోరుగా వినిపించాయి. కానీ టెక్నికల్ వర్క్స్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే రిలీజ్ విషయంలో మేకర్స్ కొద్దిగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం జూన్ 25న పెద్ది వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. విదేశాల్లో ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో జూన్ 24 అర్ధరాత్రి నుంచే భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవుల చివరిలో పెద్ది సినిమా రావడం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లకు కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ నెలకొంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో చరణ్ యాక్షన్, డైరక్టర్ మేకింగ్ స్టైల్ ఆడియన్స్‌కు కొత్త ఫీల్‌ను ఇస్తాయని మూవీ యూనిట్ అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ప్రొడ్యూసర్లు అతి త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికి జూన్ నెలలో థియేటర్ల వద్ద మెగా మేళా షురూ అవడం గ్యారంటీ అని చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
Raw Papaya : పచ్చి బొప్పాయితో ఇన్ని లాభాలా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి అట..





