Just LifestyleLatest News

Break :మైక్రో బ్రేక్స్.. పని మధ్యలో చిన్న విరామం ఉండాల్సిందేనా?

Break:ఒక నిమిషం పాటు కళ్లు మూసుకుని కూర్చోవడం కానీ, సీటులో నుంచి లేచి కాసేపు అటు ఇటు నడవడం కానీ లేదంటే మంచి నీళ్లు తాగడం వంటివి చేయడం చేయాలి.

Break

సాఫ్ట్‌వేర్, డెస్క్ జాబ్స్ చేసేవారికి ఎప్పుడూ వర్క్ టెన్షన్ ఉండటం వల్ల ప్రెషర్ పెరిగిపోతోంది. దీనికి తోడు గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల ఫిజికల్ హెల్త్ మాత్రమే కాకుండా మెంటల్‌గా కూడా ప్రశాంతత దెబ్బతింటోంది. ఇలాంటి వారికోసం ‘మైక్రో-బ్రేక్స్’ అంటే చిన్నచిన్న విరామాలు తీసుకోవడమనేది ఒక అద్భుతమైన పరిష్కారం అంటున్నారు నిపుణులు. కేవలం కొన్ని సెకన్ల నుంచి రెండు, మూడు నిమిషాల పాటు తీసుకునే ఈ చిన్న బ్రేక్స్ పనితీరును, ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

పని మధ్యలో తీసుకునే ఈ మైక్రో-బ్రేక్స్ మళ్లీ రీఛార్జ్ అవడానికి ఉపయోగపడతాయి. మైక్రో-బ్రేక్ అంటే పనిని పూర్తిగా ఆపేయడం కాదు, కేవలం ఒక నిమిషం పాటు కళ్లు మూసుకుని కూర్చోవడం కానీ, సీటులో నుంచి లేచి కాసేపు అటు ఇటు నడవడం కానీ లేదంటే మంచి నీళ్లు తాగడం వంటివి చేయడం చేయాలి. ఇలా చేయడం వల్ల మెదడుకు రెస్ట్ దొరికి, తిరిగి పని మొదలుపెట్టినప్పుడు ఏకాగ్రతతో పాటు క్రియేటివిటీ పెరుగుతుంది. కంటిన్యూగా స్క్రీన్ వైపు చూడటం వల్ల వచ్చే కంటి ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇవి ఎంతో అవసరం.

ఫిజికల్ హెల్త్ పరంగా చూస్తే, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, మెడ నొప్పి , కండరాల సమస్యలు తలెత్తుతాయి. అయితే వర్క్ మధ్యలో మైక్రో-బ్రేక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి, కండరాల బిగువు తగ్గుతుంది. దీనివల్ల దీర్ఘకాలికంగా వచ్చే ఫిజికల్ ప్రాబ్లెమ్స్‌ను నివారించవచ్చు. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించి, ఉద్యోగం పట్ల పాజిటివ్ ధోరణిని పెంచడంలో ఇవి కీ రోల్ పోషిస్తాయి. పనిలో వచ్చే చిరాకు , అలసటను తగ్గించి, ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.

Break
Break

అయితే చాలా మంది పని ఒత్తిడిలో పడి కొద్దిగా విరామం (Break)తీసుకోవడం మర్చిపోతుంటారు. ఇలాంటి వాళ్లు ప్రతి గంటకు ఒకసారి లేదా కనీసం రెండు గంటలకు ఒకసారి అలారం పెట్టుకుని మరీ ఈ చిన్నచిన్న బ్రేక్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. విరామ(Break) సమయంలో సోషల్ మీడియా చూడకుండా, కిటికీలో నుంచి బయటకు చూడటం, చిన్నపాటి స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది ‘బర్న్ అవుట్’ అంటే తీవ్రమైన మానసిక అలసట నుంచి కాపాడటమే కాకుండా, పనిలో ప్రొడక్టివిటీని రెట్టింపు చేస్తుంది. ఉద్యోగులు ఇలాంటి విరామాలు తీసుకోవడాన్ని ప్రోత్సహించే వాతావరణం ఆఫీసుల్లో కూడా కనుక ఉంటే, కంపెనీ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

Red Wine : రెడ్ వైన్ తాగితే లాభాలేనట.. కానీ వారు మాత్రం అస్సలు తీసుకోకూడదట..

Related Articles

Back to top button