Just SportsLatest News

SRH vs CSK : గెలుపు బాట పట్టేదెవరు ?..చెపాక్ లో చెన్నై, సన్ రైజర్స్ ఢీ

SRH vs CSK : సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ కీలక మ్యాచ్ లో తలపడబోతున్నాయి

SRH vs CSK

ఐపీఎల్ 19వ సీజన్ లో సోమవారం ఆసక్తికర పోరు జరగబోతోంది. ప్లే ఆఫ్ బెర్తులు మూడే మిగిలి ఉన్న నేపథ్యంలో 7 జట్లు పోటీలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్(SRH vs CSK) కీలక మ్యాచ్ లో తలపడబోతున్నాయి. దీనిలో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ కు మరింత చేరువవుతుంది. ఓడిన జట్టు రేసులో వెనుకబడుతుంది.

చెపాక్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పైనే అందరి దృష్టీ ఉంది. ఎందుకంటే సన్ రైజర్స్ తో పోలిస్తే సీఎస్కే పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్నచెన్నై మిగిలిన రెండింటిలో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. నిజానికి చెన్నై ఈ సీజన్ ఆరంభంలో తడబడుతూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవడం, మిగిలిన ప్లేయర్స్ అంచనాలకు తగ్గట్టు రాణించకపోవడం ఆ జట్టు ఓటములకు కారణమైంది.

అయితే సెకండాఫ్ లో మాత్రం అద్భుతంగా పుంజుకున్న సీఎస్కే వరుసగా ముంబై, గుజరాత్ , ఢిల్లీ వంటి జట్లపై అదరగొట్టి ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. గత మ్యాచ్ లో లక్నో చేతిలో ఓడిపోవడం కాస్త ఇబ్బందిగా మారింది. ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశముంది. ధోనీ ఈ మ్యాచ్ లో ఆడతాడని భావిస్తున్నారు.

మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. చెన్నైని ఓడిస్తే ప్లే ఆఫ్స్ కు మరింత చేరువవుతుంది. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం సన్ రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ కేవలం 86 పరుగులకే కుప్పకూలింది.

SRH vs CSK
SRH vs CSK

ఈ ఘోరపరాభవం నుంచి కోలుకున్న సన్ రైజర్స్ చెపాక్ లో అదరగొట్టాలని ఎదురుచూస్తోంది. బ్యాటింగ్ లో హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ కీలకం. బౌలింగ్ లో కమిన్స్ తో పాటు యువ పేసర్లు ప్రఫుల్ హింగే, హుస్సేన్ అదరగొడుతున్నారు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న చెపాక్ పిచ్ గతానికి భిన్నంగా బ్యాటింగ్ కు అనుకూలిస్తోంది.

ఇక్కడ 200 ప్లస్ స్కోర్లు సులభంగా నమోదవుతున్నాయి. గత రికార్డుల విషయానికొస్తే చెన్నై సూపర్ కింగ్స్ దే పై చేయిగా ఉంది. ఇరు జట్లు 24 సార్లు తలపడగా 16 మ్యాచ్ లలో చెన్నై గెలిచింది. సన్ రైజర్స్(SRH vs CSK) కేవలం 8 మ్యాచ్ లలోనే విజయం సాధించింది.

RR vs DC : రాజస్థాన్ కు ఢిల్లీ షాక్..ప్లే ఆఫ్ అవకాశాలకు దెబ్బ

Related Articles

Back to top button