Just SportsLatest News

KKR vs MI : కోల్ కథ ఏమౌతుందో ?..ముంబైతో కీలక పోరు

KKR vs MI : కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. 11 పాయింట్లతో ఉన్న KKR ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యవసరం

KKR vs MI

ఐపీఎల్ 19వ సీజన్ లో మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖాయమైపోగా ఇక ఒక్కటే మిగిలి ఉంది. ఆ ఒక్క బెర్త్ కోసం ఐదు జట్లు పోటీ పడుతుండగా.. రేసులో కోల్ కతా నైట్ రైడర్స్(KKR vs MI) కూడా నిలిచింది. ఈ సీజన్ లో పడుతూ లేస్తూ సాగిన కేకేఆర్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ 12 మ్యాచ్ లలో ఐదే గెలిచిన ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలు అనుకూలిస్తే కోల్ కతా ప్లే ఆఫ్స్ కు చేరుతుంది.

గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై విజయం ఆ జట్టు కాన్ఫిడెన్స్ ను బాగా పెంచింది. ఫిన్ అలెన్, రఘువంశీ, కామెరూన్ గ్రీన్ సూపర్ ఫామ్ లోకి వచ్చేశారు. ఈ త్రయం చెలరేగి ఆడడంతో కేకేఆర్ అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రహానే ఫామ్ లో లేకున్నా మిగిలిన వారు రాణిస్తుండడంతో కోల్ కతాకు బ్యాటింగ్ పరంగా పెద్ద ఇబ్బందేమీ లేదు.

బౌలింగ్ లోనూ ఆ జట్టు నిలకడగా రాణిస్తోంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ మ్యాజిక్ చూపిస్తుండగా.. పేస్ విభాగంలో సౌరభ్ దూబే, ముజర్బానీ బరిలోకి దిగనున్నారు.గ్రీన్ కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తుండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.

మరోవైపు ఇప్పటికే సీజన్ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ పరువు కోసం పోరాడుతోంది. గత మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ను ఓడించడం ముంబైకి కాస్త ఊరటనిచ్చింది. ఇప్పటి వరకూ 12 మ్యాచ్ లు ఆడిన ముంబై నాలుగింటిలో గెలిచి 8 మ్యాచ్ లలో పరాజయం పాలైంది. మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి సీజన్ ను గౌరవప్రదంగా ముగించాలని భావిస్తోంది.

KKR vs MI
KKR vs MI

పంజాబ్ కింగ్స్ పై భారీ టార్గెట్ ను అలవోకగా ఛేదించింది. రికెల్టన్, తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ లతో అదరగొట్టారు. అయితే సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ ముంబైకి ఇబ్బందిగా మారింది. ఈ సీజన్ లో సూర్య ఒక్క చెప్పకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. గత మ్యాచ్ కు దూరమైన హార్దిక్ పాండ్యా , సూర్యకుమార్ కోల్ కతాపై బరిలోకి దిగనున్నారు.

పాండ్యా కూడా తనదైన మెరుపులు మెరిపించి చాలారోజులైంది. అటు బౌలింగ్ లో బుమ్రా, ఘజన్ ఫర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లపై అంచనాలున్నాయి. గత రికార్డులను చూస్తే ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు(KKR vs MI) 36 మ్యాచ్ లలో తలపడగా ముంబై 25 సార్లు, కోల్ కతా 11 సార్లు గెలిచాయి. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఈడెన్ గార్డెన్స్ లో మరోసారి పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.

Prince Yadav : ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ కు పిలుపు..ఆప్ఘన్ తో సిరీస్ కు భారత జట్టు ఇదే

Related Articles

Back to top button