Just SportsLatest News

SRH vs RR : ఎలిమినేట్ అయ్యేదెవరో ?..రాజస్థాన్ తో సన్ రైజర్స్ ఢీ

SRH vs RR : ప్లే ఆఫ్స్ లో భాగంగా బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. మూడు , నాలుగు స్థానాల్లో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ న్యూ చండీగఢ్ వేదికగా తలపడబోతున్నాయి

SRH vs RR

ఐపీఎల్ 19వ సీజన్ క్లైమాక్స్ స్టేజ్ కు వచ్చేసింది. మరో మూడు మ్యాచ్ లతో ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది. ప్లే ఆఫ్స్ లో భాగంగా బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. మూడు , నాలుగు స్థానాల్లో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్(SRH vs RR) న్యూ చండీగఢ్ వేదికగా తలపడబోతున్నాయి. ఈ (SRH vs RR)మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టుతో ఆడుతుంది. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. దీంతో ఈ నాకౌట్ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.

ఎలిమినేటర్ సన్ రైజర్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. లీగ్ స్టేజ్ లో ఆర్సీబీ, గుజరాత్ జట్లతో సమానంగానే 9 విజయాలు సాధించిన హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ అదరగొడుతోంది. ఆరంభంలో బౌలింగ్ బలహీనత ఉన్నా తర్వాత దానిని అధిగమించి వరుస విజయాలు అందుకుంది. బ్యాటింగ్ లో ఎప్పటిలానే సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది.

ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ ఆ తర్వాత ఇషాన్ కిషన్, క్లాసెన్ , నితీశ్ రెడ్డి ఇలా పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా క్లాసెన్ మరోసారి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్ లో 600కు పైగా పరుగులు చేసిన క్లాసెన్ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 3లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ లైనప్ లో ఏ ముగ్గురు చెలరేగినా రాజస్థాన్ బౌలర్లకు చుక్కలే.

అటు బౌలింగ్ లో కమిన్స్ తో పాటు ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే అదరగొడుతున్నారు. స్పిన్ విభాగంలో శివాంగ్ కుమార్ కూడా కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. ఈ సీజన్ ఆరంభంలో సన్ రైజర్స్ బౌలింగ్ పై అంచనాలు లేవు. అయితే అవకాశాలను అందిపుచ్చుకున్న యువ బౌలర్లు అదరగొట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ బౌలింగ్ పటిష్టంగా మారిపోయింది.

మరోవైపు డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించి ప్లే ఆఫ్స్ కు చేరిన రాజస్థాన్ రాయల్స్ ను తక్కువ అంచనా వేయలేం. యువ , సీనియర్ ఆటగాళ్లతో నిలకడగా రాణిస్తోంది. బ్యాటింగ్ లో వైభవ్ సూర్యవంశీ , జైస్వాల్ మెరుపు ఆరంభాలనిస్తున్నారు. ఈ సీజన్ లోనూ సూపర్ ఫామ్ తో దూసుకుపోతున్న వైభవ్ 550కి పైగా పరుగులు చేశాడు.

SRH vs RR
SRH vs RR

జురెల్ కూడా టాపార్డర్ లో రాణిస్తుండడంతో రాజస్థాన్ భారీస్కోర్లు సాధిస్తోంది. పరాగ్ మాత్రం విఫలమవుతుండగా.. ఫెరీరా, శనక చివర్లో హిట్టింగ్ చేస్తున్నారు. అటు బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ కు ప్రధాన బలం. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. అతనితో పాటు బర్గర్, యశ్ రాజ్ పుంజా, బ్రిజేశ్ శర్మ కూడా ఆకట్టుకుంటున్నారు.

గత రికార్డులను చూస్తే సన్ రైజర్స్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 23 సార్లు తలపడితే హైదరాబాద్14 మ్యాచ్ లలోనూ, రాజస్థాన్ 9 సార్లు విజయం సాధించాయి. ఇక (SRH vs RR)మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న న్యూ చండీగఢ్ బ్యాటింగ్ కే అనుకూలం.

RCB : ఫైనల్లో బెంగళూరు..చిత్తుగా ఓడిన గుజరాత్

Related Articles

Back to top button