Just Andhra Pradeshjust AnalysisLatest News

Inter Students : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సమ్మర్ హాలీడేస్‌ పొడిగింపు

Inter Students : ఏపీలోని జూనియర్ కాలేజీలకు సమ్మర్ హాలీడేస్‌ను మరికొద్ది రోజులు పొడిగిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది

Inter Students

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సమ్మర్ హాలీడేస్ తర్వాత విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయం దగ్గర పడుతోంది. దీనికోసం రెండు రాష్ట్రాల విద్యాశాఖలు కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్లను సిద్ధం కూడా చేశాయి. అయితే, ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు(Inter Students) ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది.

ఏపీలోని జూనియర్ కాలేజీలకు సమ్మర్ హాలీడేస్‌ను మరికొద్ది రోజులు పొడిగిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటవ తేదీ నుంచే జూనియర్ కాలేజీలు రీ ఓపెన్ కావాల్సి ఉన్నా.. రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల వల్ల ఈ ప్రారంభ తేదీలో స్వల్ప మార్పు చేసింది.

ఏపీలో జూన్ ఐదవ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని,మిగిలిన విద్యార్థులకు(Inter Students) ఎలాంటి ఇబ్బంది కలగకుండా హాలీడేస్‌ను పొడిగించాలని ఇంటర్ ఎడ్యుకేషన్ బోర్డ్ నిర్ణయించింది. దీనికోసం ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా అధికారికంగా జీవో కూడా జారీ చేశారు.

Inter Students
Inter Students

ఈ జీవో ప్రకారం జూన్ ఐదవ తేదీ వరకు పరీక్షలు జరగనుండగా..అవి ముగిసిన తర్వాత, జూన్ ఆరవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. అయితే కాలేజీల ప్రారంభ తేదీ మారినా, ఇప్పటికే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్‌లోని మిగతా విద్యా కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, అవన్నీ ఎప్పటిలాగే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇక స్కూల్స్ విషయానికి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్ విద్యార్థులకు జూన్ పదకొండు వరకు వేసవి సెలవులు ఎప్పటిలాగే కొనసాగుతాయి. జూన్ పన్నెండవ తేదీ నుంచి ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.

Gold and Silver Lovers : బంగారం, వెండి ప్రియులకు శుభవార్త.. ధరలు పడిపోవడానికి 2 విషయాలే కారణమా?

Related Articles

Back to top button