Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ సంపాదన ఎంత? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ రేంజ్‌కు రావడానికి కారణం ఏంటి?
Vaibhav Suryavanshi : బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ పదిహేనేళ్ల కుర్రోడు క్రికెట్ ప్రపంచంలో క్రియేట్ చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు
Vaibhav Suryavanshi
కొంతమంది ఆటగాళ్లు కేవలం బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లోకి వస్తారు.. కానీ మరికొంతమంది మాత్రం ఆ బ్యాట్‌తోనే తమ భవిష్యత్తును సరికొత్తగా రాసుకుని సంచలనాలు క్రియేట్ చేస్తారు. అలాంటి ఒక అసాధారణ యువ సంచలనమే వైభవ్ సూర్యవంశీ. అందుకే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి క్రికెట్ అభిమాని నోటా వినిపిస్తున్న ఏకైక పేరు.. వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi).
బిహార్‌కు చెందిన ఈ పదిహేనేళ్ల కుర్రోడు క్రికెట్ ప్రపంచంలో క్రియేట్ చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద వేదికలపై అడుగుపెట్టి, అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా ఎక్కడా భయపడకుండా ఎదుర్కొంటున్న వైభవ్ కథ ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్.
2011 మార్చి 27న పుట్టిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi), బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తాజ్‌పూర్ అనే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాడు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వైభవ్‌కు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ కొడుకు చేతిలో బ్యాట్ పెట్టి క్రికెట్ వైపు నడిపించారు. కొడుకులోని ప్రతిభను గుర్తించిన సంజీవ్, ఆర్థిక కష్టాలు ఎదురైనా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా ముజఫర్‌పూర్, పాట్నా వంటి నగరాలకు తిప్పుతూ ట్రైనింగ్ ఇప్పించారు.
చిన్నప్పటి నుంచే క్రికెట్‌ను ఒక ఆటగా కాకుండా శ్వాసగా మార్చుకున్న వైభవ్.. బ్యాటింగ్‌లో కనిపించే టైమింగ్, వయసుకు మించిన పరిణతి చూసి క్రికెట్ దిగ్గజాలు కూడా షాక్ అయ్యారు. బీహార్ తరఫున అతి చిన్న వయసులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టి రికార్డ్ క్రియేట్‌చేసినప్పుడే, ఇతడు రాబోయే రోజుల సూపర్ స్టార్ అని చాలామంది ఫిక్స్ అయిపోయారు.
కాకపోతే వైభవ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది మాత్రం ఐపీఎల్ వేదికనే చెప్పాలి. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఇతడిని ఏకంగా ఒక కోటి పది లక్షల రూపాయల భారీ ధరకు దక్కించుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. అంత చిన్న వయసులో కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకోవడమంటే అదంత ఆషామాషీ విషయం కాదు.
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ పరుగుల సునామీ సృష్టించాడు. టోర్నీ మొత్తంలో 16 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 776 పరుగులు సాధించి, క్రిస్ గేల్ , యశస్వి జైస్వాల్ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ పవర్‌ఫుల్ ఆటతీరుతో ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్ కూడా భారీగా పెరిగిపోయింది.
ఇక వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్ దాదాపు రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తుండగా, మరికొన్ని నివేదికల ప్రకారం వైభవ్ ఆస్తుల విలువ, బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు అన్నీ కలిపితే సుమారు ఏడు కోట్ల నుంచి పది కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వైభవ్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఐపీఎల్ జీతమే అయినా.. ప్రతి మ్యాచ్‌కు వచ్చే ఫీజులు, డొమెస్టిక్ క్రికెట్ మ్యాచుల ద్వారా వచ్చే ఎర్నింగ్స్ కూడా దీనికి యాడ్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ బ్రాండ్ కాంప్లాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన వైభవ్, భవిష్యత్తులో మరిన్ని ఎండార్స్‌మెంట్ల ద్వారా కోట్ల ఇన్కమ్‌ను ఆర్జించే దిశగా దూసుకుపోతున్నాడు.

బీహార్ ప్రభుత్వం నుంచి యాభై లక్షల క్యాష్, ముంబైలో కోట్లాది విలువైన సొంత అపార్ట్‌మెంట్, గిఫ్ట్‌గా వచ్చిన లగ్జరీ కార్లు వైభవ్ రేంజ్‌ను చూపిస్తున్నా .. ఈ బుడ్డోడుని స్పెషల్‌గా నిలబెట్టేది మాత్రం అతని మైండ్ సెట్ మాత్రమే అంటారు సీనియర్స్. గ్రౌండ్‌లో ఎలాంటి ఒత్తిడినైనా చిరునవ్వుతో ఓవర్‌కమ్ చేస్తూ, భారీ షాట్లతో మైదానాన్ని ఊపేసే ఈ కుర్రాడికి ఆ మైండ్ సెట్ వల్లే అంత క్రేజ్ వచ్చిందంటారు.
ఇప్పుడు బీసీసీఐ కూడా వైభవ్‌ను భారత్-ఏ జట్టుకు ఎంపిక చేయడంతో, త్వరలోనే టీమ్ ఇండియా సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎదుగుదలను నిలబెట్టుకుంటూ ఫిట్‌నెస్ కాపాడుకుంటే మాత్రం ఫ్యూచర్‌లో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) భారత క్రికెట్‌ను శాసించే కింగ్‌గా మారతాడు అనడంలో నో డౌట్.
Inter Students : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సమ్మర్ హాలీడేస్ పొడిగింపు





