Just TelanganaJust PoliticalLatest News

Pawan Rasta: నిన్న ప్రెస్ మీట్..ఈరోజు క్రేజీ ట్వీట్..సోషల్ మీడియాను ఊపేస్తున్న పవన్ రస్తా

Pawan Rasta : ప్రముఖ విప్లవ కవి శేషేంద్ర శర్మ రాసిన ఒక అద్భుతమైన, ఆలోచనాభరితమైన కవితను పవన్ షేర్ చేశారు.

Pawan Rasta

తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ వరుసగా హాట్ టాపిక్ అవుతున్నారు. హైదరాబాద్‌లో జూన్ 2న సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం, కోర్టులో చుక్కెదురవడం, తెలంగాణ నేతల నుంచి వ్యతిరేకత ఎదురవడం వంటి పరిణామాలతో జనసేన వెనకడుగు వేస్తుందని భావించిన వారికి పవన్ కళ్యాణ్ తన మార్క్ పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చారు.

మంగళవారం సాయంత్రం తన ఇంట్లో పెట్టిన ప్రెస్ మీట్‌లో విమర్శకులపై సింహంలా గర్జించిన జనసేన బాస్.. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తాడోపేడో తేల్చుకోవడానికి తాను రెడీ అంటూ రణశంఖం పూరించారు. తనను బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదని, ప్రజా సమస్యలపై పోరాటంలో తానే స్వయంగా ముందుండి నడుస్తానంటూ తెలంగాణ లీడర్లకు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. .

అయితే ప్రెస్ మీట్ ముగిసి గంటలు గడుస్తున్నా, ఇప్పటికీ పవన్ అదే పట్టుదలతో,అదే ఆలోచనతో ఉన్నారు. తెలంగాణ పాలిటిక్స్‌లోకి పక్కా వ్యూహంతో, ఒక పర్మినెంట్ పొలిటికల్ ఫోర్స్‌గా అడుగుపెట్టడానికి జనసేనాని మైండ్‌లో ఒక లాంగ్ టర్మ్ స్కెచ్ రెడీ అయిపోయిందని క్లియర్ గా అర్థమవుతోంది.

ఏదో ప్రెస్ మీట్‌కు వచ్చాం, ఆవేశంగా మాట్లాడాం, ఇక వెళ్లాం అన్నట్టు కాకుండా.. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన జెండాను గట్టిగా పాతడమే లక్ష్యంగా పవన్ అడుగులు వేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి ఊతమిచ్చేలా బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ తన ఎక్స్ అకౌంట్‌లో పెట్టిన ఒక పవర్‌ఫుల్ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రముఖ విప్లవ కవి శేషేంద్ర శర్మ రాసిన ఒక అద్భుతమైన, ఆలోచనాభరితమైన కవితను పవన్ షేర్ చేశారు. ఆ కవితలో అదే నా రస్తా (Pawan Rasta)అంటూ పవన్ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయిపోయింది.

పవన్ పోస్ట్ చేసిన ఆ కవితను ఓసారి చూస్తే..
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో,
ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో,
గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో.. అదే నా రస్తా.
ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో,
ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో,
ఏ రస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో..అదే నా రస్తా
అంటూ పవన్ కళ్యాణ్ షేర్ చేసిన రస్తా(Pawan Rasta) కవిత జనసైనికుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

Pawan Rasta
Pawan Rasta

నిన్న ప్రెస్ మీట్ ఊపు, ఈరోజు పొద్దునే పెట్టిన ఈ రస్తా ట్వీట్.. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై జనసేన చేయబోయే ఫైట్‌లో పవన్ స్వయంగా రోడ్డు మీదకు రాబోతున్నారనే టాక్ నడుస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ డెసిషన్‌తో తెలంగాణలోని జనసేన క్యాడర్ ఫుల్ జోష్‌లో ఉంది. ఫ్యాన్స్ చెబుతున్నట్లు ప్రతీ హీరోకు, ప్రతీ నాయకుడికి అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్‌కు మాత్రం భక్తులు ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఒకేలా ఉంటుందని అంటారు. అందుకే ఫ్యూచర్‌లో తెలంగాణలో కూడా జనసేన ఒక బలమైన రాజకీయ శక్తిగా మారడం పక్కా అని వారు బలంగా చెబుతున్నారు.

Cleaning Tips : స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ క్లీనింగ్ ఇలా చేయండి.. స్క్రీన్‌ను సేఫ్ గా ఉంచే ఆ 4 టిప్స్ ఇవే..

Related Articles

Back to top button