Jamun : నేరేడు పండ్లను ఈ సీజన్లో అస్సలు మిస్ చేయకండి..ఈ 3 బెనిఫిట్స్ తెలుసుకోండి..
Jamun : నల్లగా మెరుస్తూ, నోట్లో వేసుకుంటే కాస్త వగరుగా, కాస్త తీపిగా ఉండే ఈ నేరేడు పండ్లను కేవలం టైమ్‌పాస్ కోసం తినే పండులా చూడకూడదంటారు ఆరోగ్య నిపుణులు
Jamun
సమ్మర్ సీజన్లో మార్కెట్లోకి వచ్చే నేరేడు(Jamun) పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మామిడి పండ్ల సీజన్ ముగుస్తున్న సమయంలో, జూన్ నెల స్టార్టింగ్‌లోనే బ్లాక్ జామున్ లేదా అల్ల నేరేడు(Jamun) పండ్ల సందడి మొదలవుతుంది.
నల్లగా మెరుస్తూ, నోట్లో వేసుకుంటే కాస్త వగరుగా, కాస్త తీపిగా ఉండే ఈ దేశీ పండ్లను కేవలం టైమ్‌పాస్ కోసం తినే పండులా చూడకూడదంటారు ఆరోగ్య నిపుణులు. హెల్త్ ఎక్స్పర్ట్స్ దీనిని బాడీని రీఛార్జ్ చేసే ఒక నేచురల్ మెడిసిన్ లాగా చెబుతారు. వర్షాకాలం స్టార్ట్ అయ్యే లోపు దొరికే ఈ కొద్ది రోజులు వీటిని అస్సలు వదలకుండా తినడం చాలా చాలా ముఖ్యమని అంటున్నారు.
ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న డయాబెటిస్ సమస్యకు ఈ పండు అద్భుతంగా పనిచేస్తుంది. మన బాడీలో మనం రోజూ తినే ఫుడ్ .. షుగర్ లెవెల్స్‌గా మారిపోకుండా అడ్డుకునే కొన్ని పవర్ఫుల్ సమ్మేళనాలు నేరేడు పండులో ఉంటాయి.
బ్లడ్‌లో గ్లూకోజ్ పెరగకుండా బ్రేక్స్ వేయడంలో ఇది నెంబర్ వన్ అని అధ్యయనాలు చెబుతున్నాయి. షుగర్ పేషెంట్లు తమ డైలీ లైఫ్‌లో ఉదయం కానీ సాయంత్రం పూట కానీ ఒక చిన్న కప్పు నిండా ఈ పండ్లను హ్యాపీగా తినొచ్చు. ఇవి ఇన్సులిన్ కరెక్ట్‌గా రిలీజ్ అయ్యేలా చూస్తాయి.

కేవలం షుగర్ ఉన్నవాళ్లే కాదు, ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో వీటిని ఎందుకు తినాలంటే.. వీటిలో ఇమ్యూనిటీని పెంచే విటమిన్ సి, ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి.
ఎండా కాలం నుంచి వర్షాకాలంలోకి మారే టైమ్‌లో వచ్చే రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాల నుంచి మన బాడీని కాపాడటానికి ఇది ఒక మంచి షీల్డ్ లాగా హెల్ప్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఫ్రూట్‌ను డైట్లో చేర్చుకుంటే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పని చాలా వరకు తప్పుతుందని నిపుణులు చెబుతారు.
Pawan Rasta: నిన్న ప్రెస్ మీట్..ఈరోజు క్రేజీ ట్వీట్..సోషల్ మీడియాను ఊపేస్తున్న పవన్ రస్తా





