Just Andhra PradeshJust PoliticalLatest News

Pawan Kalyan : ఓఎస్డీగా మళ్లీ బాధ్యతలు స్వీకరించిన వెంకట కృష్ణ..పవన్ కళ్యాణ్‌కు వీకే ఎందుకంత ప్రత్యేకం?

Pawan Kalyan : డిప్యూటీ సీఎం కార్యాలయంలో వెంకట కృష్ణ పనితీరు, అనుభవం ఎంతో కీలకం కావడంతో, ఆయన సేవలను కొనసాగించాల్సిందిగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ (Officer on Special Duty), అదనపు కార్యదర్శి కె. వెంకట కృష్ణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది.

నిన్నటితో అంటే జూన్ 30, 2026 కేవీకే అధికారికంగా పదవీ విరమణ చేసినా, వెంకట కృష్ణ సేవలను మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు అంటే జూలై 1, 2026 నుంచి వెంకట కృష్ణ డిప్యూటీ సీఎం అదనపు కార్యదర్శిగా, ఓఎస్డీగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు.

1990 గ్రూప్-2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వెంకట కృష్ణ‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో.. అసిస్టెంట్ సెక్రటరీగా ఉద్యోగ బాధ్యతల్లో ప్రవేశించారు. జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతులు పొందారు.

న్యాయశాస్త్రంలో డిగ్రీ సాధించటంతో పాటు మాస్టర్స్ డిగ్రీ అర్హత సాధించిన వీకేకు పంచాయతీరాజ్ వ్యవస్థపై పట్టు ఉంది. పాలనా వ్యవహారాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడంతో పాటు.. నిజాయితీగా పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన దినేష్ రెడ్డి, అనిల్ చంద్ర పుణేఠా, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నీలం సహానీ, కేఎస్ జవహర్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసి.. పాలనా వ్యవస్థలో మంచి అనుభవం గడించారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ కర్తవ్య నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేస్తారన్న కీర్తిని సాధించుకున్నారు.

జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD)లో అడిషనల్ సెక్రటరీగా పనిచేసిన వెంకట కృష్ణ, 2024 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వద్ద ఓఎస్డీగా చేరారు.

డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఆయన పనితీరు, అనుభవం ఎంతో కీలకం కావడంతో, వెంకట కృష్ణ సేవలను కొనసాగించాల్సిందిగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, నిబంధనలను సడలిస్తూ వెంకట కృష్ణను అదే పదవిలో రీ-అపాయింట్ చేసింది.

ఈ నియామకం ఈరోజు నుంచి మూడేళ్ల పాటు లేదంటే డిప్యూటీ సీఎం పదవీకాలం ముగిసే వరకు అమలులో ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గవర్నర్ పేరుతో ఈ జీవోను జారీ చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పరిధిలోని అత్యంత కీలకమైన శాఖల వ్యవహారాలను వెంకట కృష్ణ పర్యవేక్షించనున్నారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ నీటి సరఫరా అలాగే పర్యావరణం, అడవులు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తారు.

మొత్తంగా పదవీ విరమణ చేశాక కూడా పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కున్న అపారమైన నమ్మకంతో, ప్రభుత్వ అండతో వెంకట కృష్ణ ఈరోజు మళ్లీ బాధ్యతలు స్వీకరించి.. తన చాంబర్‌లో ఎప్పటిలాగే విధుల్లో కొనసాగుతున్నారు.

Aruguru Pativratalu : తెరపైకి మరోసారి ఆనాటి సంచలనం.. థియేటర్లలోకి ఈవీవీ కల్ట్ క్లాసిక్ ఆరుగురు పతివ్రతలు

Related Articles

Back to top button