Just SportsLatest News

Jacob Bethell : జాకబ్ బెథెల్ విధ్వంసం..ఇంగ్లాండ్ విజయం

Jacob Bethell : బెథెల్ జోరుకు మరో ఓవర్ మిగిలుండగానే ఇంగ్లాండ్ టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది..

Jacob Bethell

భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో మెరుగ్గానే రాణించినా బౌలింగ్‌లో నిరాశపరచడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో 29 పరుగులు ఇవ్వడం కొంపముంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశాడు. 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.

వైభవ్ ఎంట్రీతో సంజూ శాంసన్‌పై వేటు పడింది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో వైభవ్ ఒత్తిడిలో కనిపించాడు. రెండు భారీ సిక్సర్లు బాదినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. తర్వాత అభిషేక్ శర్మ తన ఫామ్ కొనసాగించాడు.దూకుడుగా ఆడుతూ 24 బంతుల్లోనే 43 (8 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేయగా తర్వాత ఇషాన్ కిషన్ , శ్రేయాస్ అయ్యర్ కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. వీరిద్దరూ మూడోవికెట్ కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇషాన్ కిషవ్ 40 బంతుల్లో 6 ఫోర్లతో 49, శ్రేయాస్ అయ్యర్ 22 బంతుల్లో 37 (3 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులతో రాణించారు. అయితే చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇషాన్ తర్వాత అక్షర్ పటేల్, హర్షిత్ రాణా వెంటవెంటనే వెనుదిరగడంతో 170 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఈ దశలో తిలక్ వర్మ మెరుపులు మెరిపించి స్కోరును 190కి చేర్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 3 వికెట్లు పడగొట్టాడు.

తర్వాత ఛేజింగ్‌లో ఇంగ్లాండ్‌కు తొలి ఓవర్లోనే అర్షదీప్ సింగ్ షాకిచ్చాడు. బట్లర్, ఫిల్ సాల్ట్‌లను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్ మెరుపులు మెరిపించారు. బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. బ్రూక్ , బెథెల్ 50 పరుగులు జోడించారు.

Jacob Bethell
Jacob Bethell

అటు బాంటన్‌తో కూడా బ్రూక్ 67 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో విల్ జాక్స్, సామ్ కుర్రాన్ ఔటైనా బెథెల్ ఇంగ్లాండ్ విజయాన్ని పూర్తి చేశాడు. నిజానికి రవిబిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ భారత్ కొంపముంచింది.

ఆ ఓవర్లో బిష్ణోయ్ 2 నోబాల్స్ , సిక్సర్లతో సహా 29 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు మొగ్గింది. బెథెల్(Jacob Bethell) జోరుకు మరో ఓవర్ మిగిలుండగానే ఇంగ్లాండ్ టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Vaibhav : బుడ్డోడు వచ్చేశాడు.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

Related Articles

Back to top button