Just LifestyleLatest News

Silence : మీ మౌనాన్ని వాళ్లు ఎలా తీసుకుంటున్నారు?..మీ బంధంలో ప్రేమ ఉన్నట్లా? లేనట్లా?

Silence : తమ పార్ట్‌నర్ ఎంత బాధపడుతున్నారో చెప్పినా కూడా అదే ప్రవర్తనను రిపీట్ చేయడానికి వారిలో ఎంపతీ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ లేకపోవడం కూడా కారణం అవుతుంది.

  1. Silence

ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మనసుకు నచ్చనిది ఏదైనా జరిగినప్పుడో, భాగస్వామిపై కోపం వచ్చినప్పుడో చాలా మంది మౌన(Silence) వ్రతాన్ని ఆశ్రయిస్తుంటారు. తాము తమ పార్ట్‌నర్‌తో మాట్లాడటం మానేస్తే వాళ్లు వచ్చి బ్రతిమాలుతారని, తమ బాధను అర్థం చేసుకుంటారని భావించి నోటికి తాళం వేస్తుంటారు.

కానీ చిత్రంగా అవతలి వ్యక్తి వారి సైలెన్స్‌(Silence)ను గుర్తించకపోగా, ఇటువంటప్పుడే తమకో ఛాన్స్ వచ్చింది అన్నట్టు తమ పాత అలవాట్లను కొనసాగిస్తూ, స్నేహితులతో గడుపుతూ మరింత బిజీ అయిపోతుంటారు.

ఇది తమ పార్ట్‌నర్‌ను ఇంకా మానసిక క్షోభకు గురి చేస్తుందన్న విషయాన్ని ఏమాత్రం తెలుసుకోలేరు. ఇలా ఒక్కసారో, రెండు సార్లో కాదు పదేపదే చెప్పినా మళ్లీ మళ్లీ ఇదే ప్రవర్తనను రిపీట్ చేస్తుంటారు.

నిజానికి ఇలా కోపం వచ్చినప్పుడు అవతలి వాళ్లతో మాట్లాడటం మానేయడాన్ని సైకాలజీలో సైలెంట్ ట్రీట్‌మెంట్ (Silent Treatment) అంటారు. అయితే, ఈ మౌనం వెనుక ఉన్న ఉద్దేశం తమ పార్ట్‌నర్‌కి శిక్ష వేయడం లేదా వారి దృష్టిని ఆకర్షించడం. కానీ అవతలి వ్యక్తి దీనిని ఒక స్పేస్ లాగా భావించి, గొడవల్లేని ప్రశాంతత దొరికిందని తన పనుల్లో బిజీ అయిపోతారు.

ఇలా జరిగినపుడు ఎప్పుడైతే ఒకరు మాట్లాడటం మానేస్తారో.. అవతలి వ్యక్తికి తమ తప్పును తెలుసుకునే అవకాశం కంటే ఆ రిలేషన్‌ నుంచి మానసికంగా డిస్‌కనెక్ట్ అయ్యే అవకాశమే ఎక్కువ అవుతుంది. దీనివల్ల సమస్య సద్దుమణగడానికి బదులు మరింత క్లిష్టంగా మారుతుంది.

కొంతమంది ఎదుటివారి మౌనాన్ని చూసి తట్టుకోలేక, ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనిని సైకాలజీలో డిఫెన్స్ మెకానిజం అంటారు.

పార్ట్‌నర్‌ కోపంగా ఉన్నప్పుడు వారికి ఎదురుపడి మాట్లాడితే గొడవ పెద్దదవుతుందనే భయంతోనో లేదా ఆ ఎమోషనల్ డ్రామాను భరించలేకో వారు తమ పాత స్నేహితులతో, హాబీలతో బిజీ అయిపోతుంటారు.

ఆ క్షణంలో వచ్చే స్ట్రెస్‌ను తీర్చుకోవడానికి తమ పాత కంఫర్ట్ జోన్‌లోకి వెళ్లిపోతుంటారు. దీనివల్ల టెంపరరీగా ప్రశాంతత దొరికినా, వారి భాగస్వామి బాధ మాత్రం రెట్టింపు అవుతుందని గ్రహించలేరు.

అయితే తమ పార్ట్‌నర్ ఎంత బాధపడుతున్నారో చెప్పినా కూడా అదే ప్రవర్తనను రిపీట్ చేయడానికి వారిలో ఎంపతీ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ లేకపోవడం కూడా కారణం అవుతుంది. ఒకరి ఫీలింగ్స్‌ను అర్థం చేసుకుని, వారి స్థానంలో నిలబడి ఆలోచించే మానసిక పరిణతి చాలామందికి ఉండదు.

నువ్వు మాట్లాడకపోతే నాకేంటి, నా జీవితం నాదే అనే ఈగో లేదా నిర్లక్ష్య వైఖరి వారిలో తెలీకుండానే ఉండొచ్చు. గొడవను సద్దుమణిగేలా చేయడం కంటే, తమ ఈగోను సంతృప్తి పరుచుకోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది అవతలి వ్యక్తిలో మరింత ఒంటరితనాన్ని, నిరాశను కలిగిస్తుందన్న సంగతిని తెలుసుకోలేరు.

Silence
Silence

ఇలాంటి మానసిక సంఘర్షణ రెగ్యులర్‌గా ఎదురైనప్పుడు మౌనంగా ఉంటూ అవతలి వ్యక్తి మారతారని ఆశించడం వేస్ట్. ఎందుకంటే మీ మౌనం ఎప్పుడూ కూడా వారికి మరింత స్వేచ్ఛను ఇస్తుందే తప్ప కాస్తంత కూడా పశ్చాత్తాపాన్ని కలిగించదు. కాబట్టి కోపం వచ్చినప్పుడు కమ్యూనికేషన్ పూర్తిగా కట్ చేసి మాట్లాడకుండా ఉండే బదులు మీకోపాన్ని, మీ అసంతృప్తిని ముఖం మీదే చెప్పేయటమే మంచిది.

నువ్వు చేస్తున్న ఈ పని నన్ను చాలా బాధపెడుతోందని డైరెక్టుగా మీ పార్ట్‌నర్‌కు చెప్పేయండి. అయితే అలా చెప్పిన తర్వాత కూడా వారు తమ పాత అలవాట్లతోనే బిజీ అయిపోతుంటే, ఆ రిలేషన్‌లో మీ స్థానం ఏంటో మీరు మరోసారి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందనే అర్థం. ఎందుకంటే మీ మీద ప్రేమ ఉన్నవాళ్లు ఎప్పటికీ ఇలా చేయరు..చేయలేరు.

No Marriage : సోలో బతుకే సో బెటర్ .. పెళ్లికి నో అంటున్న యూత్

Related Articles

Back to top button