Karmic Relationship : కార్మిక్ రిలేషన్ షిప్ అంటే ఏంటో తెలుసా? మీది కూడా అలాంటి బంధమేనా?
Karmic Relationship : ఈ కార్మిక్ రిలేషన్ షిప్‌ను గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలుంటాయి. ఇలాంటి బంధంలోకి అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే అవతలి వ్యక్తితో ఎన్నో శతాబ్దాల పరిచయం ఉన్నట్లు, వారి వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది.
Karmic Relationship
మనుషుల బంధాలలో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ కొన్ని బంధాలు మాత్రం చాలా విచిత్రంగా, చాలా పవర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. అలాంటి వాటిలో ఆధ్యాత్మిక ప్రపంచంలో , సైకాలజీలో ఎక్కువగా వినిపించే పేరే కార్మిక్ రిలేషన్ షిప్(Karmic Relationship). అసలు కార్మిక్ రిలేషన్ షిప్ అనేది ఒకటి ఉందా, ఉంటే దాని అర్థం ఏంటి, అది మనిషి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు.
దీనిని కర్మ సిద్ధాంతం ప్రకారం చూస్తే.. పూర్వ జన్మలో తీరని బాకీలు, జీవితంలో నేర్చుకోకుండా వదిలేసిన జీవిత పాఠాలు ఏమైనా ఉంటే, వాటిని పూర్తి చేయడానికి ఈ జన్మలో ఒక స్పెసిఫిక్ పర్సన్ మన జీవితంలోకి ప్రవేశిస్తారని నమ్ముతారు. ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే అత్యంత తీవ్రమైన, ఒడిదుడుకులతో కూడిన రిలేషన్‌ను కార్మిక్ రిలేషన్ షిప్ అంటారు.
అయితే ఇక్కడే చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. తమ లైఫ్ పార్ట్నర్ లేదా ప్రేమించే వ్యక్తితో విపరీతమైన గొడవలు అవుతున్నా.. మానసిక క్షోభ అనుభవిస్తున్నా.. ప్రేమ అన్నాక గొడవలు ఉండవా అని , బహుశా వీరే నా సోల్‌మేట్ ఏమో అని భ్రమిస్తూ ఆ నరకాన్ని భరిస్తూ ఉండిపోతారు.
కానీ సోల్‌మేట్ లేదా ట్విన్ ఫ్లేమ్ బంధాలు అనేవి పార్ట్నర్ మనస్సుకు ప్రశాంతతను ఇస్తూ, కెరీర్ గ్రోత్‌కు దారి తీస్తాయి. అక్కడ గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకునే క్వాలిటీ ఉంటుంది. కానీ కార్మిక్ రిలేషన్ అలా కాదు. ఇది కేవలం వినాశనానికి మాత్రమే దారితీస్తుంది. దీనిలో కంటిన్యూగా గొడవలు, అనుమానాలు, ఇన్సెక్యూరిటీ (Insecurity) ఫీలింగ్, విపరీతమైన ఎమోషనల్ డ్రామా చోటుచేసుకుంటాయి.
ఒకరోజు ఎంతో ప్రేమగా ఉంటూ స్వర్గంలో ఉన్నట్లు అనిపించిన వారి బంధం.. మరుసటి రోజే నరకం చూపిస్తున్నట్లు మనస్పర్ధలతో ఇబ్బందులు పడేలా ఉంటుంది. మొత్తంగా ఇలాంటి బంధం వారిని మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది.
ఈ కార్మిక్ రిలేషన్ షిప్(Karmic Relationship)ను గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలుంటాయి. ఇలాంటి బంధంలోకి అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే అవతలి వ్యక్తితో ఎన్నో శతాబ్దాల పరిచయం ఉన్నట్లు, వారి వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆకర్షణ ఎంత బలంగా ఉంటుందంటే ఎదుటివారిని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేనంత పిచ్చి ప్రేమలో బతుకుతారు.
తర్వాత తర్వాత అవతలి వ్యక్తి మనకు అస్సలు సెట్ కాదని తెలిసినా సరే చివరకు వారి వల్ల నిత్యం కన్నీళ్లు పెట్టుకుంటున్నా కూడా ఏదో తెలీని అదృశ్య శక్తి వారి వైపు లాగుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఇలాంటి రిలేషన్‌ను ఒక అంతుచిక్కని సుడిగుండంలా అభివర్ణిస్తారు. అయితే సైకాలజీ పరంగా చూస్తే, ఇలాంటి బంధాలు మనుషులలోని పాత గాయాలను, భయాలను బయటకు తీయడానికి ఉపయోగపడతాయట. ఒక వ్యక్తి తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవడానికి, తనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ కార్మిక్ బంధాలు ఒక గురువులా పనిచేస్తాయట.

అయితే కార్మిక్ రిలేషన్ షిప్‌లు అనేవి జీవితాంతం కలిసి ఉండటానికి ఏర్పడేవి కావని మానసిక, ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అవి కేవలం ఆ మనిషిలోని ఆత్మ ఎదుగుదలకు, కొన్ని కఠినమైన జీవిత పాఠాలు నేర్పడానికి మాత్రమే ఏర్పడతాయట. ఎప్పుడైతే మనం ఆ పాఠాన్ని పూర్తిగా గ్రహిస్తామో, అప్పుడు ఆ బంధం నుంచి విడిపోవడం ఈజీ అవుతుంది.
ఇలాంటి బంధం నుంచి బయటపడాలంటే మొదట మనపై మనం ప్రేమను పెంచుకోవాలి. అవతలి వ్యక్తి మారతారని ఎదురుచూడటం ఆపేసి, మన మానసిక ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. మనల్ని మనం పూర్తిగా మార్చుకుని, జీవితంలో ముందడుగు వేయడమే ఈ కార్మిక్ బంధానికి(Karmic Relationship) అసలైన ముగింపు అని తెలుసుకోవాలి.





