Just NationalJust BusinessLatest News

Gold : రెండో రోజూ దిగివచ్చిన బంగారం గ్రాఫ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి?

Gold : ఏడాదిగా రికార్డు స్థాయి ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం రేట్లు మెల్లమెల్లగా దిగివస్తున్నాయి. రెండు రోజులుగా మార్కెట్‌లో కనిపిస్తున్న తగ్గుదల కొనుగోలుదారులలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

Gold

భారతీయుల సంస్కృతిలో, సాంప్రదాయాలలో పుత్తడికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పండగలు, శుభకార్యాలు ఏవైనా సరే పసిడి కొనడం అనేది ఒక సెంటిమెంట్‌గానే వస్తోంది. అలాగే ఎంతోమందికి ఆపద కాలంలో ఆదుకునే నమ్మకమైన ఆర్థిక భరోసా కూడా ఇదే. అయితే ఏడాదిగా రికార్డు స్థాయి ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం(Gold) రేట్లు మెల్లమెల్లగా దిగివస్తున్నాయి. రెండు రోజులుగా మార్కెట్‌లో కనిపిస్తున్న తగ్గుదల కొనుగోలుదారులలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి మెయిన్ సిటీలలో.. బుధవారం నాటి మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 2130 తగ్గి తులం బంగారం ధర రూ. 1లక్ష43వేల 130 కు చేరుకోగా ఈరోజు అంటే గురువారం మరో రూ. 10 మాత్రమే తగ్గి రూ. 1లక్ష 43వేల 120 వద్ద కొనసాగుతోంది.

ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి(Gold) ధర బుధవారం రూ. 1950 వరకూ తగ్గగా, ఇవాళ కేవలం రూ. 10 తగ్గి రూ.1లక్ష31వేల 190 వద్ద స్థిరపడింది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 1లక్ష 07వేల 340 గా నమోదైంది.

ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం 1,43,120 రూపాయలుగా, 22 క్యారెట్ల ధర 1,31,190 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1లక్ష43వేల 270 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష31వేల340 గా నమోదైంది.

ఇక చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్ల తులం గోల్డ్ రూ. 1 లక్ష44వేల 540 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష32వేల490 , 18 క్యారెట్ల ధర రూ. 1లక్ష10వేల690 గా కొనసాగుతోంది.

Gold
Gold

గోల్డ్‌తో పాటే సిల్వర్ ధరలు కూడా సామాన్యులకు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. బుధవారం నాటి మార్కెట్‌లో కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 భారీ పతనం నమోదు కాగా, ఇవాళ గురువారం కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ మరో రూ. 100 తగ్గింది.

దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో ఒక గ్రాము సిల్వర్ ధర రూ. 244.90 కు చేరగా, కిలో వెండి ధర రూ. 2లక్షల44వేల900వద్ద రికార్డైంది. ముంబై, చెన్నై నగరాల్లోనూ ఇవే ధరలు ఉండగా, ఢిల్లీలో మాత్రం సిల్వర్ ధర రూ. 2లక్షల45వేల 100 వద్ద కాస్త ఎక్కువగా ట్రేడ్ అవుతోంది.

Healthy Drink : ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతున్నారా? ఈసారి రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచే ఈ హెల్దీ డ్రింక్‌ ట్రై చేయండి..

Related Articles

Back to top button