Just SportsLatest News

IND vs ENG : మరో వైట్ వాష్ పరాభవం.. చివరి టీ20లోనూ భారత్ చిత్తు

IND vs ENG : అర్ష్‌దీప్ సింగ్ మినహా మిగిలిన బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగులు చేసింది.

IND vs ENG

ఇంగ్లాండ్ టూర్‌లో భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా ఆఖరి టీ20లోనూ ఓడిపోయింది. బౌలర్లు పేలవ ప్రదర్శన వేళ… బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ… మరో వైట్ వాష్ పరాభవాన్ని చవిచూసింది. ఫలితంగా సిరీస్ ను 4-0తో స్వీప్ చేసిన ఇంగ్లాండ్(IND vs ENG) వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి అగ్రస్థానాన్ని సైతం లాగేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ఊహించినట్టుగానే భారత తుది జట్టులో మార్పులు జరిగాయి. వైభవ్ సూర్యవంశీ, వాషింగ్టన్ సుందర్‌లను తప్పించి సంజూ శాంసన్ , సూర్యాన్షు షెడ్గేలకు అవకాశం కల్పించారు. వరుసగా ఏడోసారి టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫిల్ సాల్ట్ (6) త్వరగానే ఔటైనా బట్లర్, బ్రూక్ మాత్రం రెచ్చిపోయారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 233 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇది భారీ రికార్డు. ఈ క్రమంలో బట్లర్ సెంచరీ బాదేశాడు. కేవలం 51 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

అటు బ్రూక్ కూడా మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఫలితంగా భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బట్లర్ 64 బంతుల్లో 131 పరుగులు చేశాడు. బట్లర్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అటు హ్యారీ బ్రూక్ కేవలం 45 బంతుల్లోనే 96 రన్స్ చేయగా అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి.

IND vs ENG
IND vs ENG

అర్ష్‌దీప్ సింగ్ మినహా మిగిలిన బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాపై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో శివమ్ దూబే 2 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ 1 వికెట్ పడగొట్టారు. తర్వాత ఛేజింగ్ లో టీమిండియా చేతులెత్తేసింది.

సంజూ శాంసన్ (27), అభిషేక్ శర్మ (3) పరుగులకే వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. చివరికి భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ 3 , ఆదిల్ రషీద్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓటమితో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానం చేజార్చుకోగా.. ఇంగ్లాండ్ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది.

S.Janaki : భారత సంగీత లోకంలో విషాదం.. లెజెండరీ సింగర్ ఎస్ .జానకి కన్నుమూత

Related Articles

Back to top button