Love : మీ ప్రేమలో స్వార్థం ఉండాలా? వద్దా?.. భగవద్గీత ఇచ్చే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఏంటి?
Love : చాలామంది ఏదైనా హెల్ప్ చేసేటప్పుడు కూడా ముందు వెనుకా ఆలోచించి, తమకు దీని వల్ల లాభం వస్తుందా రాదా అని లెక్కలు వేసుకుంటారు.
Love
ఈ రోజుల్లో రిలేషన్‌షిప్స్‌లో నిజాయితీ అనేది చాలా అరుదుగా కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు చూపించే ప్రేమ, మాట్లాడే మాటలు, చేసిన సాయం.. ఇలా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక స్వార్థం దాగి ఉంటోంది. దీని గురించే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో నిజమైన ప్రేమ యొక్క అసలు రూపాన్ని బోధించారు.
కండిషన్లు లేని ప్రేమ, స్వార్థం లేని మాటలు, కారణం లేని సాయం, ప్రతిఫలం ఆశించని ఆదరణ.. ఇవే నిజమైన ప్రేమ తత్వం అంటూ కృష్ణుడు చెప్పిన బోధనలు నేటి తరానికి కూడా ఆదర్శమే. ఇవి బంధాలలో అనవసరపు పట్టుదలకు వెళ్లకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక చక్కని మార్గాన్ని చూపిస్తాయి.
ఈ తరం బంధాలలో చాలావరకు నువ్వు నేను చెప్పినట్లే వినాలనే రూల్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ నిజమైన ప్రేమ(Love)అంటే అవతలి వ్యక్తి ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకోకూడదు. వారు తప్పులు చేసినప్పుడు కోపం చూపించినా కూడా మన ప్రేమను మాత్రం వారికి దూరం చేయకూడదు. మరీ ఇబ్బందిగా ఉంటే మనల్ని మనం కాపాడుకోవడానికి బంధంలో కొన్ని లిమిట్స్ పెట్టుకుని దూరం జరగవచ్చేమో కానీ, అవతలి వారికి చెడు జరగాలని మాత్రం ఎప్పుడూ ఆశించకూడదు.
అలాగే మనం మాట్లాడే మాటలు ఎప్పుడూ కూడా అవతలి వారిని ఇబ్బంది పెట్టేలా చేయడానికి ఒక ఆయుధంగా మార్చకూడదు. మనసులో ఏమీ దాచుకోకుండా చెప్పగలగడం, మనకు బాధ కలిగితే డైరెక్టుగా వారికి చెప్పేయడం, భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు ప్రశాంతంగా వినడం అలవాటు చేసుకోవాలి.
ఈ రోజుల్లో చాలామంది ఏదైనా హెల్ప్ చేసేటప్పుడు కూడా ముందు వెనుకా ఆలోచించి, తమకు దీని వల్ల లాభం వస్తుందా రాదా అని లెక్కలు వేసుకుంటారు. కానీ ఎలాంటి కారణం లేకుండా సాయం చేయడం లేదా ప్రేమను పంచడమనేది మన సహజ స్వభావంగా మారిపోవాలి. ఎప్పుడైతే మనం బంధాలలో నేను ఇంత చేశాను, నాకేం దక్కిందని లెక్కలు వేస్తామో, అక్కడే వారి ప్రేమ భారంగా మారిపోయిందని అర్ధం.
ఎదుటివారు ఎలా ఉన్నా మన నైజం ప్రకారం చాతనైనంతగా మనం మంచి చేయాలని అనుకోవాలి. అయితే మన ఆదరణకు, సాయానికి అవతలి వైపు ఏ మాత్రం విలువ లేనప్పుడు, గొడవలు పడి వారిని మార్చాలని చూడొద్దు. ప్రశాంతంగా ఒక అడుగు వెనక్కి వేసి, వారికి మంచి జరగాలని కోరుకుంటూ పక్కకు తప్పుకోవడమే మంచిది.

నిజమైన లవ్(Love)అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది కాదు.. అది ప్రతీ మనిషి లోపల ఉండే ఒక మంచి మానసిక స్థితి. కఠినమైన ప్రపంచంలో కూడా మనిషి తన హృదయాన్ని మృదువుగా ఉంచుకుంటూ లోకాన్నంతా ప్రేమతో చూడటమే అసలైన భగవద్గీత సారాంశమని గుర్తించాలి. అయితే దీని అర్థం అవతలి వాళ్లు మనల్ని కావాలని వాడుకుంటున్నా సరే.. అమాయకంగా, మౌనంగా వారిని భరిస్తూ ఉండమని కాదు.
నిజానికి నిజమైన ప్రేమ(Love)లో మనల్ని మనం ప్రేమించుకోవడం కూడా ఒక భాగంగానే ఉంటుంది. మన ప్రశాంతతను పాడుచేసే ఎలాంటి చోటు నుంచైనా బయటకు రావడానికి తెలివిగా అడుగులు వేయడం ప్రతీ మనిషికి చాలా ముఖ్యం. ఎందుకంటే మనల్ని మనం గౌరవించుకున్నప్పుడు, ప్రేమించినపుడు మాత్రమే ఇతరులను కూడా స్వేచ్ఛగా ప్రేమించగలమని శ్రీ కృష్ణ పరమాత్ముడు సెలవిచ్చారు.
Rohit Sharma : లండన్‌కు రోహిత్ పేరెంట్స్..సెలక్టర్లతో హిట్ మ్యాన్ వాగ్వాదం..అసలేం జరుగుతోంది ?





