Just NationalLatest News

Ration Card : ఒకే ఇంట్లో రెండు రేషన్ కార్డులు సాధ్యమేనా?.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

Ration Card : పెళ్లయిన కొత్త జంటలు ,పేరేంట్స్‌తో కలిపి కాకుండా ఒకే కాంపౌండ్‌లో ఉంటూ వంటగది, బడ్జెట్ విడివిడిగా మెయింటైన్ చేసేవాళ్లు సెపరేట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.

Ration Card

రేషన్ కార్డు అనేది కేవలం రేషన్ షాపులో బియ్యం కోసమే కాదు, చాలా గవర్నమెంట్ స్కీమ్‌లకు అడ్రస్ ప్రూఫ్‌గా, ఐడెంటిటీగా పనిచేస్తుంది. అందుకే చాలామంది ఫ్యామిలీలో ఉంటున్నా తమకు విడిగా కార్డు ఉండాలని అనుకుంటున్నారు.

ఒకే ఇంట్లో అన్నదమ్ములు విడిపోయినా, కుటుంబంలోని వారి పిల్లలు వేరు కాపురం పెట్టినా విడిగా రేషన్ కార్డు(Ration Card) తీసుకోవచ్చా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇది కచ్చితంగా సాధ్యమే. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి విడిపోయి కొత్త కార్డు పొందాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి.

ముఖ్యంగా పెళ్లయిన కొత్త జంటలు ,పేరేంట్స్‌తో కలిపి కాకుండా ఒకే కాంపౌండ్‌లో ఉంటూ వంటగది, బడ్జెట్ విడివిడిగా మెయింటైన్ చేసేవాళ్లు సెపరేట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే జాబ్స్ కోసం వేరే సిటీకి వెళ్లి అక్కడ ఉంటున్న వాళ్లు కూడా విడిగా కార్డు తెచ్చుకోవచ్చు.

ఇక్కడ చాలామందికి తెలీని విషయం ఏంటంటే, పెళ్లి కాని వాళ్లు కూడా ఒంటరిగా జీవిస్తూ.. సొంతంగా కిచెన్ మెయింటైన్ చేస్తుంటే వాళ్లకు కూడా విడిగా రేషన్ కార్డు(Ration Card) పొందే హక్కు ఉంటుంది. కానీ పేరెంట్స్‌ పాటే ఉంటూ ఒకే వంటగది వాడుతుంటే మాత్రం విడిగా కార్డు ఇవ్వరు.

ఈ ప్రాసెస్‌లో మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మీ పాత ఫ్యామిలీ రేషన్ కార్డు నుంచి మీ పేరును తొలగించాలి. పేరు తొలగించిన తర్వాత ఆఫీసర్స్ ఇచ్చే సరెండర్ సర్టిఫికేట్ లేదా కేన్సిల్ పత్రాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి.

 

అది ఉంటేనే కొత్త కార్డుకు అప్లై చేయడానికి వీలవుతుంది. ఆ సర్టిఫికెట్‌తో పాటు ఆధార్ కార్డు, మీరు ఉంటున్న ఇంటి అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా రెడీ చేసుకుని మీ సేవ లేదా అఫీషియల్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మీరు అప్లై చేసిన కొద్ది రోజుల్లోనే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ మీ ఇంటికి వచ్చి తనిఖీ చేస్తారు. మీరు నిజంగానే విడిగా ఉంటున్నారా.. మీ కిచెన్ విడిగా ఉందా అనేది వాళ్లు చెక్ చేసుకుంటారు.

అంతా కరెక్ట్ గా ఉందని వాళ్లు రిపోర్ట్ ఇస్తే, గవర్నమెంట్ మీకు కొత్త రేషన్ కార్డు జారీ చేస్తుంది. అయితే ఈ రూల్స్ అనేవి స్టేట్‌ని బట్టి కొద్దిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అప్లై చేసే ముందు మీ లోకల్ ఆఫీస్ గైడ్‌లైన్స్ చూసుకోవడం మంచిది.

Vikram-1: అంతరిక్ష రేసులో భారత్ టాప్-3..నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేట్ రాకెట్..

Related Articles

Back to top button