Just Andhra PradeshJust TelanganaLatest News

Covid Cases : మళ్లీ మొదలైన కరోనా కలకలం..వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లు ధైర్యంగా ఉండొచ్చా?

Covid Cases : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం, ఇప్పటికే కొన్ని చోట్ల కోవిడ్ మరణాలు కూడా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

Covid Cases

కొన్నాళ్లుగా అంతా కూల్‌గా ఉందనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి మళ్లీ మెల్లగా తన రూపం మారుస్తూ సైలెంట్‌గా అటాక్ చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం, ఇప్పటికే కొన్ని చోట్ల కోవిడ్(Covid Cases) మరణాలు కూడా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు పూణేలోని వైరాలజీ ల్యాబ్ రిపోర్టుల్లో ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5 అనే కొత్త సబ్‌వేరియంట్‌ను కడపలో కూడా గుర్తించడంతో..హెల్త్ ఆఫీసర్లు వెంటనే అలర్ట్ అయ్యారు.  ఏపీలో  కేసులు మెల్లగా పెరిగి 39 కి చేరుకోవడం, హాస్పిటళ్లలో జాయిన్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జనాలలో టెన్షన్ మొదలయింది.

ఇక తెలంగాణలోనూ ఒకటి రెండు కేసులు బయపడుతుండటం మరింత ఆందోళన కలిగించే విషయంగా ఉంది.
హైదరాబాద్‌లోని కార్పొరేట్ , గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఇప్పటికే జ్వరం, తీవ్రమైన దగ్గు, ఒళ్లు నొప్పులు, జలుబుతో వచ్చే పేషెంట్ల రష్ పెరుగుతోంది.

డేటా ప్రకారం తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా కూడా, రియల్ పిక్చర్ బయటకు రావడం లేదనే ప్రచారం కూడా నడుస్తోంది. ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. ఇప్పుడు తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ కూడా నిఘా పెంచాల్సిన సిట్యువేషన్ ఏర్పడింది.

Covid Cases
Covid Cases

అయితే ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆరోగ్యశాఖ చెబుతున్నా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామంది ఇప్పటికే రెండు డోసులతో పాటు బూస్టర్ డోసులు వేసుకున్నాం కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ ఉంటుందన్న కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రాణాపాయం తగ్గొచ్చు గానీ, అసలు ఇన్ఫెక్షన్ రాకుండా ఆపలేవు అనే పాయింట్‌ను అంతా గుర్తుంచుకోవాలి.

అందుకే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయిన బస్సులు, మెట్రోలు, ట్రైన్స్‌లో వెళ్లేటపుడు లేదా మాల్స్, ఆఫీసుల వంటి క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్‌లో మాస్క్ ధరించడం అలవాటును ఫాలో అవ్వడం మంచిది. అలాగే జ్వరం వచ్చినపుడు సీజనల్ ఫీవర్ అని లైట్ తీసుకోకుండా..కొన్ని సింప్టమ్స్ కనిపించినా వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవడం మంచిది.

Date Of Birth : ఈ నెంబర్స్ వారికి జాక్‌పాట్..వీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి..

Related Articles

Back to top button