Megastar Chiranjeevi : ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. మెగాస్టార్ టీమ్ రియాక్షన్
Megastar Chiranjeevi : ఏపీ టూరిజం రంగాన్ని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ప్రభుత్వం చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబోతోంది అంటూ కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో న్యూస్ వినిపించింది.
Megastar Chiranjeevi
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ న్యూస్‌లో ఎలాంటి నిజం లేదని చిరంజీవి పర్సనల్ టీమ్ తేల్చి చెప్పేసింది. ఇవన్నీ కేవలం ఎలాంటి ఆధారం లేని పుకార్లేనని, ఇలాంటి వార్తలను ఫ్యాన్స్ గానీ, నెటిజన్లు గానీ ఎవరూ నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది. టీమ్ మెగాస్టార్ చిరంజీవి పేరుతో తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ క్రిస్పీ ప్రకటనను రిలీజ్ చేసింది.
ఆ ప్రకటనలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులవుతున్నారని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి రూమర్లను ఎవరూ నమ్మకండి, అలాగే దానిని షేర్ చేయకండి. ఏదైనా సమాచారం ఉంటే అపీషియల్‌గా తెలిసేవరకు సోషల్ మీడియాలో పంచుకోవద్దు అని చెప్పారు.
ఇటీవల ఏపీ టూరిజం రంగాన్ని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ప్రభుత్వం చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబోతోంది అంటూ కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా న్యూస్ వినిపించింది. గతంలో గుజరాత్ టూరిజం రంగాన్ని ప్రమోట్ చేయడానికి అమితాబ్ బచ్చన్‌ను ఉపయోగించుకున్నట్లుగానే, ఆంధ్రప్రదేశ్‌కి కూడా మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ అండ్ క్రేజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ న్యూస్ బాగా వైరల్ అవ్వడంతో మెగాస్టార్ టీమ్ వెంటనే రంగంలోకి దిగి ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.

కాగా ప్రస్తుతం చిరంజీవి తన కంప్లీట్ ఫోకస్‌ను కేవలం మూవీలపైనే ఉంచుతున్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర షూటింగ్‌లో చిరు బిజీగా ఉన్నారు. ఈ విజువల్ వండర్ పిక్చర్ ఈ ఏడాది అక్టోబర్ 16న దసరా పండుగ కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. దీంతో పాటు మాస్ డైరెక్టర్ బాబీతో వస్తున్న ‘మెగా 158’ ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది. ఈ మూవీ టైటిల్ టీజర్‌ను ఆగస్టు 22న చిరు బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇప్పటి నుంచే నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు.





