Just LifestyleLatest News

Online Dating : ఆన్‌లైన్ డేటింగ్‌తో కాన్ఫిడెన్స్ పోతుందా?..నేటి యూత్ వీటిని ఎందుకు వద్దు అనుకుంటున్నారు?

Online Dating : అబ్బాయిలకు వందల స్వైప్‌ల తర్వాతే ఒకటో, రెండో మ్యాచెస్ వస్తాయి. అలా వచ్చినా అవి డేట్‌ వరకు వెళ్లవు. ఈ కంటిన్యూ రిజెక్షన్ వాళ్ల కాన్ఫిడెన్స్‌ని పాతాళానికి తొక్కేస్తుంది.

Online Dating

ఒకప్పుడు గుండెల్లోంచి పుట్టుకొచ్చే పరిచయాలు, ప్రేమలు.. ఇప్పుడు కేవలం ఒక డిజిటల్ మ్యాచ్, ఒక నోటిఫికేషన్ చుట్టూ రౌండ్లు కొడుతున్నాయి. స్క్రీన్‌పై రైట్ స్వైప్ చేస్తే చెప్పలేని హ్యాపీనెస్.. లెఫ్ట్ స్వైప్ పడితే చెప్పకోలేని నిరాశ అన్నట్టుగా తయారయ్యాయి.

ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఒకరినొకరు కలుసుకోవడం ఎంత ఈజీ అయిందో, అంతకంటే వేగంగా ఇవి మన కాన్ఫిడెన్స్‌ను , మెంటల్ పీస్‌ను దెబ్బతీస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు డేటింగ్ అనేది రెండు మనసుల కలయికలా కాకుండా ..ఒక మార్కుల రిపోర్ట్ కార్డులా మారిపోతోంది.

నేను 7 పాయింట్ల మనిషిని అయితే, నాకు 8 లేదా 9 ఉన్న పార్ట్‌నర్ ఎలా దొరుకుతారని లెక్కలు వేసుకునే ట్రెండ్ ఎక్కువైంది. యాప్‌లలో తగిన మ్యాచ్ వస్తే రోజంతా కిక్‌తో గడిపేసేవాళ్లంతా.. రాకపోతే తనలో ఏదో లోపం ఉందేమోననే ఇన్‌సెక్యూరిటీతో బాధపడుతున్నారు.

ఈ డేటింగ్ యాప్‌లలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ డిఫరెంట్ ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నారు. అబ్బాయిలకు వందల స్వైప్‌ల తర్వాతే ఒకటో, రెండో మ్యాచెస్ వస్తాయి. అలా వచ్చినా అవి డేట్‌ వరకు వెళ్లవు. ఈ కంటిన్యూ రిజెక్షన్ వాళ్ల కాన్ఫిడెన్స్‌ని పాతాళానికి తొక్కేస్తుంది. మరోవైపు అమ్మాయిలకు వందల మ్యాచెస్ వచ్చి పడతాయి. కానీ వాటిలో జెన్యూన్ పర్సన్స్ ఎవరో, టైమ్ పాస్ రాయుళ్లేవరో తేల్చుకోవడం చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది.

ఈ యాప్స్ కోసం డిజైన్ చేసిన ప్రొఫైల్స్, ఫోటోలు, ఎమోజీలతో అల్గోరిథమ్‌లు ఇద్దరి మధ్య ఒక కనెక్షన్‌ని క్రియేట్ చేయగలవేమో కానీ, ఆ ఇద్దరి మధ్య ఉండాల్సిన ఆ ఆఫ్‌లైన్ కెమిస్ట్రీని ఏమాత్రం తీసుకురాలేవన్న నిజాన్ని ఈ తరం అర్ధం చేసుకుంటుంది.

అందుకే ఈ డిజిటల్ హడావుడితో విసిగిపోయిన యూత్.. ఇప్పుడు మళ్లీ రియల్ వరల్డ్ కనెక్షన్ల వైపు అడుగులు వేస్తున్నారు. రన్ క్లబ్‌లు, సోషల్ ఈవెంట్లు, కమ్యూనిటీల ద్వారా డైరెక్ట్‌గా కలుసుకోవడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే డైరెక్టుగా కలిసినప్పుడు వచ్చే స్పార్క్ ఏ స్క్రీన్ ప్రొఫైల్‌లోనూ దొరకదు.

Online Dating
Online Dating

డేటింగ్‌లో నిజమైన కాన్ఫిడెన్స్ అనేది ఇతరుల లైక్‌లు, మ్యాచ్‌ల మీద ఆధారపడి ఉండకూడదు. తనను తాను షై టైప్ అనో, ఇంట్రోవర్ట్ అనో, నేను అందంగా లేను అనో స్టాంప్ వేసుకోవడం ఆపేయాలి.

ఇవన్నీ మన బిహేవియర్‌లోని కొన్ని అలవాట్లు మాత్రమే తప్ప, మన పర్మినెంట్ గుర్తింపులు కావు. యాప్‌లు కేవలం పరిచయాలకు ఒక మార్గం మాత్రమే. క్లియర్ కమ్యూనికేషన్, కొత్త విషయాలు తెలుసుకునే క్యూరియాసిటీ, రిజెక్షన్‌ని నవ్వుతూ యాక్సెప్ట్ మనస్తత్వం ఉన్నప్పుడే ఏ రిలేషన్‌ అయినా నిలబడుతుంది. మన వ్యాల్యూ అనేది స్క్రీన్‌పై పడే ఒక స్వైప్ డిసైడ్ చేయలేదని నేటి యూత్ బాగా అర్ధం చేసుకుంటున్నారు.

Special Person : మనసుకు ఒక సేఫ్ పర్సన్ అవసరమా? సంతోషమైనా, బాధ అయినా వాళ్లతో పంచుకుంటే సరిపోతుందా?

Related Articles

Back to top button