Just SportsLatest News

Yashasvi Jaiswal : సచిన్, మంజ్రేకర్ క్లబ్‌లో జైస్వాల్..తొలి సెంచరీతో దేవదత్ పడిక్కల్ రికార్డుల వేట

Yashasvi Jaiswal : సచిన్ టెండూల్కర్, సంజయ్ మంజ్రేకర్ కలిసి ఉన్న ఒక ఎలైట్ క్లబ్‌లోకి ..ఇప్పుడు జైస్వాల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తన టెస్ట్ కెరీర్‌లో ఆడిన మొదటి 30 మ్యాచ్‌లను.. 30 వేర్వేరు వేదికల్లో ఆడాడు.

Yashasvi Jaiswal

శ్రీలంకతో జరుగుతున్న గాలే మైదానం వేదికగా సాగుతున్న తొలి టెస్టులో భారత యంగ్ సెన్సేషన్స్.. రికార్డులు, డ్రామా, అద్భుతమైన షాట్లతో మ్యాచ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఈ పోరులో యశస్వి జైస్వాల్ ఒక అరుదైన మైలురాయిని అందుకోగా, వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ సాలిడ్ సెంచరీతో లంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు.

భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) బరిలోకి దిగడమే ఈ మ్యాచ్‌లో ఒక హిస్టారిక్ మూమెంట్‌గా మారింది. టీమిండియా దిగ్గజాలయిన సచిన్ టెండూల్కర్, సంజయ్ మంజ్రేకర్ కలిసి ఉన్న ఒక ఎలైట్ క్లబ్‌లోకి ..ఇప్పుడు జైస్వాల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తన టెస్ట్ కెరీర్‌లో ఆడిన మొదటి 30 మ్యాచ్‌లను.. 30 వేర్వేరు వేదికల్లో ఆడటం విశేషం.

గతంలో సంజయ్ మంజ్రేకర్ వరుసగా 33 వేర్వేరు గ్రౌండ్లలో, సచిన్ 32 మైదానాల్లో ఆడి ఈ యూనిక్ రికార్డును క్రియేట్ చేయగా.. ఇప్పుడు జైస్వాల్ కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అయిపోయాడు.

కాకపోతే ఈ స్పెషల్ మ్యాచ్‌లో జైస్వాల్ బ్యాటింగ్ ఆశించినంతగా సాగలేదు. 32 పరుగుల వద్ద ఉన్నప్పుడు కేఎల్ రాహుల్‌తో సింగిల్ చేసే ప్రయత్నంలో ఫీల్డర్ అడ్డురావడంతో క్రీజు మధ్యలో జారిపడ్డాడు. దీంతో ఇద్దరూ ఒకే ఎండ్‌కు చేరడంతో జైస్వాల్ రనౌట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.కాగా జైస్వాల్ టెస్టు కెరీర్‌లో ఇలా రనౌట్ అవ్వడం ఇది మూడోసారి.

ఇటు వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన యంగ్ గన్ దేవదత్ పడిక్కల్ తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడుతూ లంక బౌలింగ్‌లో చీల్చిచెండాడాడు. 134 బంతుల్లోనే తన కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీ మార్కును అందుకుని అదరగొట్టాడు.

మరో ఎండ్‌లో సిసలైన పార్ట్‌నర్‌షిప్‌తో నిలిచి 77 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, ఊహించని విధంగా తీవ్రమైన కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

Yashasvi Jaiswal
Yashasvi Jaiswal

2024 సెప్టెంబర్‌లో శుభ్‌మన్ గిల్ తర్వాత భారత్ తరఫున.. వన్‌డౌన్ పొజిషన్‌లో సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా పడిక్కల్ చరిత్రలో క్రియేట్ చేశాడు. కొద్దికాలంగా ఆ ప్లేస్‌లో భారత్ ఏడుగురు వేర్వేరు బ్యాటర్లను మార్చి చూసినా ఫెయిల్ కాగా, పడిక్కల్ ఈ నాక్‌తో ఆ స్థానానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అని ప్రూవ్ చేశాడు.

మొత్తంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా లంకపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించి 2 వికెట్ల నష్టానికి 288 పరుగుల స్కోరుతో దీటుగానే నిలిచింది. క్రీజులో దేవదత్ పడిక్కల్ (131 నాటౌట్), రిషభ్ పంత్ (27 నాటౌట్) క్రియాశీలకంగా నాటౌట్‌గా నిలిచారు. అయితే రెండో రోజు ఆటకు వర్షం విలన్‌లా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

TTD : శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నవంబర్ కోటా ఆన్‌లైన్ రిలీజ్ డేట్స్, లక్కీ డిప్ వివరాలు ఇవే..

Related Articles

Back to top button