Just Andhra PradeshJust PoliticalLatest News

AP Assembly : నేటి నుంచే వర్షాకాల సమావేశాలు..అసెంబ్లీలో సైలెంట్ మండలిలో వైలెంట్ అంటున్న వైసీపీ

AP Assembly : అసెంబ్లీలో కూల్‌గా, మండలిలో హాట్‌హాట్‌గా సాగబోతున్న ఈ పొలిటికల్ పోరుపై ఏపీలో ఉత్కంఠ పెరిగిపోయింది.

AP Assembly

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మరో హాట్ చాప్టర్ ఓపెన్ కావడానికి టైమ్ సెట్ అయిపోయింది. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆహ్వానంతో ఆగస్ట్17 సోమవారం ఉదయం నుంచి ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.

అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నమాట లేకుండా ఒకవైపు కూటమి ఎమ్మెల్యేలు మాత్రమే సందడి చేయబోతుంటే.. శాసనమండలిలో మాత్రం కూటమి ప్రభుత్వానికి షాకివ్వడానికి మరోవైపు విపక్ష వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అయిపోయింది. దీంతో అసెంబ్లీలో కూల్‌గా, మండలిలో హాట్‌హాట్‌గా సాగబోతున్న ఈ పొలిటికల్ పోరుపై ఏపీలో ఉత్కంఠ పెరిగిపోయింది.

ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు కష్టాలు, విద్యాశాఖ వ్యవహారాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైసీపీ తమ శాసనమండలి సంఖ్యాబలాన్ని ఫుల్‌గా వాడుకోవాలని డిసైడ్ అయింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయంపై దిశానిర్దేశం చేశారు.

తమకు ప్రతిపక్ష హోదా (ఎల్‌ఓపీ) ఇవ్వకుండా తమ గొంతును నొక్కేస్తున్నారని చెబుతున్న జగన్.. సభను బహిష్కరిస్తూనే మండలిలో మాత్రం తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సుమారు 13 త్రైమాసికాలుగా పెండింగ్‌లో పడిపోయిన రూ. 9,100 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అలాగే రూ. 3,300 కోట్ల వసతి దీవెన నిధులను తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేయబోతున్నారు.

అంతేకాకుండా వీటితో పాటు మెగా డీఎస్సీ-2025 వ్యవహారంలో..ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ..దీనిపై సీబీఐ విచారణ వేయాలని కౌన్సిల్‌లో గట్టిగా పట్టుబట్టబోతున్నారు.

అయితే ఇటు అసెంబ్లీ(AP Assembly) విషయానికి వస్తే స్టోరీ వేరేలా ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేనందుకు నిరసనగా వైసీపీ సభకు రాకుండా బహిష్కరించాలంటూ ముందే తేల్చేసింది.కాగా దీనిపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం రోజే ఒక ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

AP Assembly
AP Assembly

సభ ఏర్పాట్లన్నీ పూర్త అయ్యాయని, జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితే మంత్రులతో పక్కాగా ఆన్సర్లు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ కూడా ఇచ్చారు. అసలు సభకు హాజరుకాని ప్రజాప్రతినిధులకు శాలరీలు ఎందుకు ఇవ్వాలని సూటిగా ప్రశ్నించిన స్పీకర్.. దీనిపై పార్లమెంట్‌లో చర్చించి ఒక చట్టం తీసుకురావాలని చేసిన కామెంట్స్ ఏపీలో రాజకీయాలను హీటెక్కించాయి.

అయితే స్పీకర్ ఆఫర్‌ను పక్కనపెట్టి ఎప్పటిలాగే వైసీపీ అసెంబ్లీకి రాకపోవడంతో, ఈ వర్షాకాల సమావేశాలు పూర్తిగా కూటమి సభ్యుల మధ్యే సాగనున్నాయి.

సభలో ఏపీ ప్రభుత్వం తరఫున ఎల్ నినో ఎఫెక్ట్, దాంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజధాని అమరావతి సిటీ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయనే ప్రోగ్రెస్ నివేదికలపై కూటమి నాయకులు చర్చించడానికి రెడీ అయ్యారు. మొత్తానికి అసెంబ్లీ(AP Assembly)లో చర్చలు ప్రశాంతంగా సాగినా, మండలిలో మాత్రం అధికార, విపక్షాల నడుమ రచ్చ కాస్త హడావుడి గ్యారంటీ అనిపిస్తోంది.

Paneer : హెల్దీ ప్రోటీన్ అని పనీర్‌ను కొంటున్నారా?అది ప్యూర్ పాల పనీరా లేక కెమికల్ అనలాగ్ పనీర్ అనేది తెలుసా?

Related Articles

Back to top button