Just Andhra PradeshJust PoliticalLatest News

NagaBabu : నాగబాబుకు బిగ్ ఆఫర్.. కేబినెట్ హోదాతో కీలక బాధ్యతలు..

NagaBabu : ఏపీలో పర్యావరణ పరిరక్షణకు మేలు జరిగేలా కొత్త ప్లాన్స్, మాస్టర్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడంలో నాగబాబు గైడెన్స్‌లోని కార్యనిర్వాహక కమిటీ అత్యంత కీలక పాత్ర పోషించబోతోంది.

NagaBabu

ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. నటుడు, జనసేన ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య కొణిదెల నాగబాబుకు కూటమి ప్రభుత్వం కీలకమైన బాధ్యతను అప్పగించింది.

ఏదో పేరుకే పదవి ఇవ్వడం అన్నట్లుగా కాకుండా , ఆయనకు ఏకంగా కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ పర్యావరణ, అటవీశాఖ నుంచి అఫీషియల్‌గా జీవో కూడా వెలువడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ఈ పక్కా ప్లాన్‌తో కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ఏపీ సర్కార్ కొణిదెల నాగబాబు(NagaBabu)ను ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ’ (Green Executive Committee) చైర్మన్‌గా నియమించింది.

ఏపీలో అడవుల విస్తరణను విపరీతంగా పెంచడంతో పాటు.. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ గ్రీన్ కవర్ పెంచడమే ఈ కమిటీ మెయిన్ టార్గెట్. నాగబాబు(NagaBabu) నేతృత్వంలో పనిచేసే ఈ టీమ్ ఏపీ వ్యాప్తంగా మూలమూలలా విస్తృతంగా పర్యటించబోతోంది.

పర్యావరణ పెంపొందింపు కోసం చేపట్టే రకరకాల కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు, ఏపీ వ్యాప్తంగా సాగే భారీ మొక్కలు నాటే ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో పరిశీలన చేసి పనులను వేగవంతం చేయడంలో ఈ కమిటీ చాలా కీలకంగా వ్యవహరించబోతోంది.

NagaBabu
NagaBabu

ఏపీలో పర్యావరణ పరిరక్షణకు మేలు జరిగేలా కొత్త ప్లాన్స్, మాస్టర్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడంలో నాగబాబు గైడెన్స్‌లోని ఈ కార్యనిర్వాహక కమిటీ అత్యంత కీలక పాత్ర పోషించబోతోంది.

ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్, అటవీ శాఖలను పర్యవేక్షిస్తుంటే.. మరోవైపు పర్యావరణాన్ని కాపాడే గ్రీన్ కమిటీకి అన్నయ్య నాగబాబు సారథ్యం వహించనుండటంతో ..గ్రీన్ ఆంధ్రప్రదేశ్ మిషన్ మరింత స్పీడప్ కానుందని ఏపీ వాసులు భావిస్తున్నారు.

Sravana Masam : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు?.. భక్తి వెనుక సైన్స్ కూడా ఉందా?

Related Articles

Back to top button