Dimagi Naxal Party : మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చిందోచ్..గంటల్లోనే లక్షల్లో ఫాలోవర్స్..పేరేంటో తెలుసా ?
Dimagi Naxal Party : ఇప్పుడు అలాంటి తరహాలోనే సోషల్ మీడియా వేదికగా మరో పార్టీ పుట్టుకొచ్చింది. ఈసారి కొత్త పార్టీ రావడానికి కారణం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే అని తెలుస్తోంది.
Dimagi Naxal Party
సీజేఐ చేసిన చిన్న వివాదాస్పద వ్యాఖ్యలతో బొద్దింకల పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసు. కేవలం గంటల వ్యవధిలో మిలియన్లలో ఫాలోవర్స్ రావడం..కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వ్యంగ్యంగా ఎంట్రీ ఇచ్చి దేశ రాజధాని ఢిల్లీలో ఎంత పెద్ద ఉద్యమానికి కారణమైందో అందరూ చూసారు.
ఇప్పుడు అలాంటి తరహాలోనే సోషల్ మీడియా వేదికగా మరో పార్టీ పుట్టుకొచ్చింది. ఈసారి కొత్త పార్టీ రావడానికి కారణం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో పురుడు పోసుకున్న ఆ కొత్త పార్టీ పేరు దిమాగీ నక్సల్ పార్టీ(Dimagi Naxal Party). ఎర్రకోట వేదికగా ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సాయుధ నక్సలిజం అంతమైందని, అయితే ప్రభుత్వ వ్యవస్థల్లో ఉంటూ విధానాలను ప్రభావితం చేసే బౌద్ధిక, దిమాగీ నక్సల్స్ ఆలోచనా విధానం ఇంకా కొనసాగుతోందని, వారిని గుర్తించి వేరు చేయాలని ప్రధాని అన్నారు.
ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, నెటిజన్లు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిని, ప్రశ్నలు అడిగే మేధావులను భయపెట్టడానికే ఇలాంటి ముద్రలు వేస్తున్నారంటూ విమర్శించారు.

అయితే రాజకీయ వర్గాల్లో కంటే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెర లేచింది. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి మాధ్యమాలలో దిమాగీ నక్సల్ పార్టీ పేరుతో అకౌంట్లు పుట్టుకొచ్చాయి. కేవలం 24 గంటల్లోనే ఈ పేజీలకు లక్షలాది మంది ఫాలోవర్లు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆలోచించు, పరిశోధించు, ప్రతిఘటించు అనే నినాదంతో ఈ పేజీలు వైరల్ గా మారాయి. ఇప్పటికే మీమ్స్, వ్యంగ్యాస్త్రాలు పోస్ట్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇన్‌స్టా వివరాల ప్రకారం ఇటీవలే ఈ ఖాతా తెరిచినట్టు గుర్తించారు. అయితే ఈ అకౌంట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కాగా ఈ కొత్త పార్టీ ఎలాంటి ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
NagaBabu : నాగబాబుకు బిగ్ ఆఫర్.. కేబినెట్ హోదాతో కీలక బాధ్యతలు..





