HealthJust LifestyleLatest News

Beetroot Dosa : రోజూ బోర్ కొట్టే దోసేనా?.. ఈ కలర్‌ఫుల్ దోస ట్రై చేయండి..

Beetroot Dosa : విటమిన్లతో నిండిన బీట్‌రూట్‌ను.. నార్మల్ టిఫిన్‌లో కలిపేసి పింక్ కలర్‌తో కరకరలాడే బీట్‌రూట్ దోసను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

Beetroot Dosa

ఉదయం లేచాక ఈరోజు టిఫిన్ ఏంటని అనగానే ప్లేట్‌లో అదే తెల్లటి దోస కనిపిస్తే ఎంత బోర్ కొడుతుంది కదా. ఇంట్లో పిల్లలైతే అస్సలు తినడానికి ఇష్టపడరు. కానీ అదే దోసని కాస్త కలర్‌ఫుల్‌గానే కాకుండా హెల్దీగా అండ్ కరకరలాడేలా కూడా డిఫరెంట్‌గా చేసి పెడితే.. ప్లేట్ నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. అలా విటమిన్లతో నిండిన బీట్‌రూట్‌ను.. నార్మల్ టిఫిన్‌లో కలిపేసి పింక్ కలర్‌తో కరకరలాడే బీట్‌రూట్ దోసను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

ఈ స్పెషల్ బీట్ రూట్ దోస(Beetroot Dosa) తయారు చేసుకోవడానికి ఒక కప్పు మినపప్పుతో పాటు మూడు కప్పుల బియ్యం, ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, పావు టీస్పూన్ మెంతులను తీసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి నీళ్లతో బాగా కడిగి 6 నుంచి 8 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి.

ఇవి బాగా నానిన తర్వాత నీళ్లు ఒంపేసి మిక్సీ జార్‌లో వేయాలి. దీనికి తోడుగా ఒక పెద్ద బీట్‌రూట్ ముక్కలు, 6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ చిక్కగా అనిపిస్తే లైట్‌గా నీళ్లు కలిపి మనం రెగ్యులర్‌గా వాడే దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా రెడీ చేసి పెట్టుకోవాలి.

Beetroot Dosa
Beetroot Dosa

తర్వాత దోస పెనాన్ని పొయ్యి మీద పెట్టి బాగా వేడెక్కనిచ్చాక. ఒక గరిటెడు బీట్‌రూట్ దోసల పిండిని మధ్యలో వేసి పల్చగా, గుండ్రంగా పెద్దగా తిప్పాలి. తర్వాత దోస చుట్టూ, పైన ఒక టీస్పూన్ నూనె వేసి మీడియం ఫ్లేమ్‌లో ఓ 2 నుంచి 3 నిమిషాలు కాలనిస్తే దోస మంచి క్రిస్పీగా మారుతుంది. అంతేకాకుండా అదిరిపోయే పింక్ కలర్‌లోకి వస్తుంది. ఈ వేడి వేడి బీట్‌రూట్ దోస(Beetroot Dosa)ను అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీతో గానీ తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది.

Antibiotics : ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ మింగుతున్నారా?..అది మీ ఒంటికి డేంజరస్ పాయిజన్ అని తెలుసా

Related Articles

Back to top button