HealthLatest News

Dates : రోజూ 2 ఖర్జూరాలు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Dates : గుండె ఆరోగ్యం విషయంలో ఖర్జూరం ఒక కేరింగ్ ప్రొటెక్టర్ అనే చెప్పొచ్చు. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం శరీరంలోని సోడియం ఎఫెక్ట్‌ను తగ్గించి, బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.

Dates

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా వర్షాలు పడుతున్న ఈ సమయంలో మన బాడీ ఇమ్మ్యూనిటీ దారుణంగా పడిపోతూ ఉంటుంది. ఇలాంటి రెయినీ సీజన్‌లో ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా, నేచర్ మనకి ఇచ్చిన నేచురల్ స్వీట్ ఖర్జూరం తినమని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ప్రాసెస్ చేసిన చెత్త స్వీట్లకు పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్‌గా చెప్పుకునే ఈ డ్రై ఫ్రూట్.. బాడీకి కావలసిన కంప్లీట్ విటమిన్లు, మినరల్స్‌ను ఇస్తుంది.

ఖర్జూరం కేవలం రుచి కోసమే కాదు, పోషకాల ల్యాండ్ మార్క్ కూడా అంటారు ఆరోగ్య నిపుణులు. ఒక ఖర్జూరంలో శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ఐరన్ నిండి ఉంటాయి. వీటిలో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ కాబట్టి ఎంచక్కా తినొచ్చు.

వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిగా ఉంటుంది. కానీ ఖర్జూరం(Dates)లో ఉండే హై ఫైబర్ జీర్ణక్రియను వేగంగా నడిపిస్తుంది. ప్రేగుల మూవ్‌మెంట్‌ను సెట్ చేసి, మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి ప్రాబ్లమ్స్‌కి పర్ఫెక్ట్‌గా చెక్ పెడుతుంది. నీరసంగా ఉన్నప్పుడు ఇది తింటే దీనిలోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే నేచురల్ షుగర్లు ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తాయి.

గుండె ఆరోగ్యం విషయంలో ఖర్జూరం ఒక కేరింగ్ ప్రొటెక్టర్ అనే చెప్పొచ్చు. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం శరీరంలోని సోడియం ఎఫెక్ట్‌ను తగ్గించి, బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. బ్లడ్ వెసల్స్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరకుండా చూస్తూ హార్ట్ డిసీజుల రిస్క్‌ను బాగా తగ్గిస్తాయి.

అలాగే ఖర్జూరాల్లో(Dates) ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్ వంటి పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరలోని ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేసి, సెల్స్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. రిజల్ట్‌గా ఇన్ఫ్లమేషన్ తగ్గి, క్యాన్సర్, షుగర్ వంటి డేంజరస్ జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.

Dates
Dates

బ్లడ్ తక్కువగా ఉండి ఎనీమియాతో బాధపడేవాళ్లకు ఖర్జూరం ఒక వరమనే అనాలి. దీనిలోని ఐరన్ కంటెంట్ బ్లడ్ పెరుగుదలకు, హిమోగ్లోబిన్ లెవెల్స్ బూస్ట్ అవ్వడానికి బాగా సాయం చేస్తుంది.

అలాగే మాంగనీస్, మెగ్నీషియం ఎముకల డెన్సిటీని పెంచి ఎముకలను స్ట్రాంగ్‌గా మారేలా చేస్తాయి. రోజుకి 2 నుంచి 3 ఖర్జూరాలను ఉదయాన్నే కానీ లేదా ఈవినింగ్ స్నాక్‌గా కానీ తినొచ్చు. పాలలో ఉడకబెట్టి తాగినా లేదా స్మూతీస్, సలాడ్స్‌లో,లడ్డూలలో యాడ్ చేసుకున్నా టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ గ్యారంటీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Fridge Tips : ఫ్రిడ్జ్‌లో ఇవి పెడుతున్నారా? నిపుణులు చెప్తున్న షాకింగ్ నిజాలు..

Related Articles

Back to top button