Just InternationalLatest News

Nepal Floods : నేపాల్‌ను ముంచెత్తిన రాక్షస వరద..ఈ వినాశనం వెనుక సైంటిఫిక్ మిస్టరీ ఇదే..

Nepal Floods : ఆగస్ట్ 26న టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రారంభమైన ఈ ప్రకృతి విపత్తు, నేపాల్‌లోని రసువా, ధాడింగ్ జిల్లాలపై చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపించింది.

Nepal Floods

మొన్నటి వరకూ హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా ఉండే నేపాల్‌ను నిన్న ఆకస్మిక వరదలు, భయంకరమైన బురద ప్రవాహాలు ఒక్కసారిగా అతలాకుతలం చేయడం చూశాం. భోటే కోషి నది ఉగ్రరూపం దాల్చడంతో కళ్లముందే వందలాది కుటుంబాలు వీధిన పడటంతో.. ఊళ్లకు ఊళ్లే నీట మునిగిపోయాయి.

అయితే మొదట్లో ఈ బీభత్సానికి బలమైన భూకంపమే కారణమని అందరూ అనుకున్నారు..కానీ అసలు కథ వేరే ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపెట్టింది. అసలు అక్కడ జరిగింది ఎలాంటి భూకంపం కూడా కాదని, ఏకంగా ఒక భారీ హిమానీనదం గ్లేసియర్ కూలిపోవడం, దాంతో పాటు కొండచరియల శిథిలాలు కిందకు దూసుకు రావడమే ఈ వినాశనానికి అసలు కారణమని తమ తాజా విశ్లేషణలో సైంటిఫిక్‌గా నిర్ధారించింది.

బుధవారం ఆగస్ట్ 26న టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రారంభమైన ఈ ప్రకృతి విపత్తు, నేపాల్‌లోని రసువా, ధాడింగ్ జిల్లాలపై చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. భోటే కోషి నది ప్రవాహంలో భారీగా మట్టి, రాళ్లు, మంచు శిథిలాలు కొట్టుకురావడంతో ఇళ్లు, రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

ఈ సంఘటన జరగడానికి సరిగ్గా ముందు భూమిలో ఊహించని రీతిలో భూ ప్రకంపనలు రావడంతో, అధికారులు 4.4 తీవ్రతతో కూడిన భూకంపంగా దానిని రికార్డ్ చేశారు. కానీ యూఎస్‌జీఎస్ నిపుణులు ఉపగ్రహ చిత్రాలతో పాటు, భూకంప కేంద్రాల నుంచి వచ్చిన దీర్ఘకాలిక తరంగాలను గంటల తరబడి లోతుగా విశ్లేషించిన తర్వాత అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

భారీ మంచు పర్వతం ఒకటి కిందికి జారడం వల్ల వచ్చిన షాక్ వేవ్స్ మాత్రమే భూమి కంపించినట్లు కనిపించేలా చేశాయని క్లారిటీ ఇచ్చిన యూఎస్‌జీఎస్ నిపుణులు.. ప్రకంపనల తీవ్రతను 4.4 నుంచి 5.2కి సవరిస్తూ భూకంపం జరగలేదని వివరించారు.

దాదాపు 5,200 మీటర్ల భారీ ఎత్తులో కొండ అంచునున్న హిమానీనదం ఒక్కసారిగా కిందకు జారడమే ఈ జలప్రళయానికి మూలమని నిపుణులు తేల్చారు. విపత్తుకు ముందు, ఆ తర్వాత తీసిన శాటిలైట్ ఫోటోలను పరిశీలిస్తే.. కేవలం 24 గంటల వ్యవధిలోనే అక్కడి గ్లేసియర్లు విపరీతంగా మంచును కోల్పోయినట్లు తేలింది.

Nepal Floods
Nepal Floods

వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మంచు చాలా వేగంగా కరిగి, ఆ నీరంతా హిమానీనదం అడుగు భాగానికి చేరింది. దీంతో అక్కడ ఉపరితలం బాగా జిడ్డుగా, జారేలా మారడంతో ఆ భారీ మంచు కొండ తన పట్టును కోల్పోయి 5,200 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. దీంతో నదిలోకి ఒక్కసారిగా వేలాది టన్నుల శిథిలాలు చేరి నీటి మట్టం కంట్రోల్ తప్పింది.

ఈ ఊహించని ప్రకృతి ఉపద్రవం నేపాల్‌లో కోలుకోలేని విషాదాన్ని నింపింది. ఇప్పటివరకు అందిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 162 మంది ప్రాణాలు కోల్పోగా, 750 మందికి పైగా ఆచూకీ లేకుండా గల్లంతయ్యారు. ఈ గల్లంతైన వారిలో 133 మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. బురదలో, వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక బృందాలు డే అండ్ నైట్ రెస్క్యూ ఆపరేషన్లను కొనసాగిస్తున్నాయి.

Gold – Silver Rates : నాన్‌స్టాప్ పుత్తడి పరుగులు..షాక్ ఇస్తున్న గోల్డ్, సిల్వర్ రేట్లు..

Related Articles

Back to top button