Bigg Boss 10 : బిగ్ బాస్ 10 హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీలు వీరేనా?..మరి దశావతారం కాన్సెప్ట్‌తో గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడు?
Bigg Boss 10 : ఈ సీజన్లో కూడా మొత్తం 15 మంది కంటెస్టెంట్లే బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయబోతున్నారు. అందులో ఆరుగురు కామనర్ కాగా, మిగిలిన తొమ్మిది మంది పాపులర్ సెలబ్రిటీలు
Bigg Boss 10
ఈ షోని ఎవడైనా చూస్తాడా అని బయటకు ఎంతమంది మాట్లాడుకున్నా, తీరా కొత్త సీజన్ మొదలయ్యేసరికి టీవీ స్క్రీన్లకు అతుక్కుపోవడం బిగ్ బాస్ ఆడియన్స్‌కు అలవాటైపోయిన ఒక క్రేజీ అడిక్షన్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే 9 సీజన్లను సక్సెస్ఫుల్ కాంబోలతో క్రేజీగా నడిపించిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. ఇప్పుడు ల్యాండ్‌మార్క్ 10వ సీజన్(Bigg Boss 10 )కోసం గ్రాండ్‌గా రెడీ అవుతోంది.
మరికొద్ది రోజుల్లోనే ఈ ధమాకా సీజన్ ప్రసారం కాబోతుండటంతో.. అసలు ఈసారి హౌస్‌లోకి వెళ్లే ఆ లక్కీ కంటెస్టెంట్లు ఎవరనే చర్చ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇదే సమయంలో బిగ్ బాస్ లవర్స్ కోసం వైరల్ అవుతున్న సెలబ్రిటీల కన్ఫర్మ్డ్ లిస్ట్ అలాగే కామనర్స్ వివరాలు బయటకు వచ్చేశాయి.
గత సీజన్లో కేవలం ఫేమస్ స్టార్లతో అగ్నిపరీక్ష పద్ధతి ద్వారా కామనర్స్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇంట్లోకి వెళ్లిన డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల లాస్ట్ వరకు సత్తా చాటగా, కళ్యాణ్ టైటిల్ గెలుచుకుని బిగ్ బాస్ హిస్టరీలోనే రికార్డు క్రియేట్ చేశాడు.
అదే సక్సెస్ ఫార్ములాను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ..అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా ఆరుగురు కామనర్స్‌ను హౌస్‌లోకి పంపడానికి రసవత్తర టాస్క్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం టాప్ 15లో ఉన్న అమన్ మసూద్, ఝాన్సీ, శ్రష్టి వ్యాకరణి, రామకృష్ణ, భాగీ తుళ్లూరి, రోహిత్ నాయుడు, ప్రియాంక, మిథిలేష్, గాయత్రి, అపూర్వ, షాలినీ, చరణ్, రాజకుమారి, హేమంత్ యాదవ్, దీపక్ సేనాపతి వీరిలో ఆరుగురుకి హౌస్‌లోకి ఎంట్రీ ఉండబోతోంది.
ఈ సీజన్లో కూడా మొత్తం 15 మంది కంటెస్టెంట్లే బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయబోతున్నారు. అందులో ఆరుగురు కామనర్ కాగా, మిగిలిన తొమ్మిది మంది పాపులర్ సెలబ్రిటీలు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వివరాల ప్రకారం బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు గుప్పెడంత మనసు ఫేమ్ ముఖేష్ గౌడ తన సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళా ఆడియన్స్‌కు ఎంతో దగ్గరయ్యాడు.
అలాగే చాలా సినిమాల్లో తన అమాయకమైన యాక్షన్‌తో, హాస్యంతో మెప్పించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కృష్ణుడు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఇక బుల్లితెరపై గ్లామర్ అండ్ యాక్టింగ్‌తో వేదగా అలరించిన బెంగాలీ భామ దేబ్జానీ మోదక్ తన అందచందాలతో, పర్ఫార్మెన్స్తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
మరోవైపు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ టెంపర్‌లో విలన్ క్యారెక్టర్‌తో భయపెట్టిన వంశీ, హౌస్‌లోకి వస్తే తన అగ్రెసివ్ టాలెంట్‌తో గేమ్ ఆడే అవకాశం ఉంది.
బుల్లితెర కామెడీ కింగ్స్ అయిన జబర్దస్త్ ఆటో రామ్‌ప్రసాద్ తన పంచ్ డైలాగులతో, కౌంటర్లతో ఆడియన్స్‌ను నవ్వించడానికి రెడీ అవుతుండగా.. కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నరేష్ తమదైన టైమింగ్ కామెడీతో హౌస్‌లో ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇక గ్లామరస్ యాంకర్ వర్షిణి సౌందరాజన్ తన గ్లామర్‌తో పాటు ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో చిన్న తెరపై మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. యాక్టర్ అదిత్ ఈశ్వరన్ తన ప్రామిసింగ్ యాక్టింగ్ స్కిల్స్‌తో మూవీలలో , డిజిటల్ స్పేస్‌లో గుర్తింపు తెచ్చుకుని ఈసారి హౌస్‌లోకి అడుగుపెడుతున్నాడు.
ఈ తొమ్మిది మంది సెలబ్రెటీలతో ఈ బిగ్ బాస్ హౌస్‌లో గ్లామర్, గొడవలు, కామెడీ ఏదీ మిస్ అవ్వకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీగా కనిపించేలా ఉంది. వీళ్లతో పాటు సౌందర్య రెడ్డి, సుహాసిని, చైత్ర రాయ్ వంటి సీరియల్ యాక్ట్రెస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఈసారి షో డిజైన్ అంతా దశావతారం అనే యూనిక్ కాన్సెప్ట్‌తో ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. ఈ మైండ్ బ్లాకింగ్ సీజన్ 10(Bigg Boss 10 )సెప్టెంబర్ 6న కానీ సెప్టెంబర్ 13వ తేదీ నుంచి కానీ గ్రాండ్‌గా ప్రసారం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ ప్రమోషన్లు ప్రారంభమైతే ఈ కంటెస్టెంట్ల లిస్ట్ అండ్ డేట్పైన పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.
Cellulitis : కాళ్లపై ఎర్రటి వాపు, నెప్పి వేధిస్తోందా? సెల్యులైటిస్ ఏమో చెక్ చేసుకోండి..





