HealthLatest News

Fish : ఆరోగ్యానికి మంచిదని ఫిష్ తింటున్నారా?..అయితే మీరు తింటుంది చేపలు కాదు..ప్లాస్టిక్ అంటే నమ్ముతారా?

Fish : సముద్ర తీరాలు, నదుల్లోకి ప్లాస్టిక్ వేస్టేజ్‌లు ఏవీ కలవకుండా ప్రభుత్వాలు పక్కా సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి.

Fish

హెల్త్‌కు మంచిదని, హార్ట్‌కు మేలు చేస్తుందని చాలామంది చికెన్, మటన్ పక్కన పెట్టి మరీ సీఫుడ్ తీసుకుంటారు. కానీ, ఇప్పుడు ఆ ఫిష్ ప్లేట్ చూస్తేనే భయపడాల్సిన పరిస్థితి కళ్ల ముందుకు వచ్చింది. మనం డైలీ వాడుతున్న ప్లాస్టిక్ కవర్లు, సీసాలు ఇష్టానుసారంగా సముద్రంలోకి విసిరేస్తున్న వ్యర్థాలు.. తిరిగి మన కడుపులోకే చేరుతున్నాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం చేపట్టిన తాజా రీసెర్చ్ స్పష్టం చేసింది.

విశాఖపట్నం హార్బర్‌ నుంచి అధ్యయనం గురించి సేకరించిన నెత్తళ్లు, సావిడాయి (రిబ్బన్ ఫిష్) చేపలపై చేసిన రీసెర్చ్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. యూనివర్శిటీ టీమ్ పరిశీలించిన 120 నెత్తళ్లు, 20 సావిడాయిల్లోనూ ప్రతి పరీక్షలో కూడా మైక్రోప్లాస్టిక్ కణాలు దర్శనమిచ్చాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో పబ్లిష్ అయిన ఈ రిపోర్ట్, సముద్ర కాలుష్యం ఏ స్థాయికి చేరిందో కళ్లకు కట్టినట్లు చెప్పింది.

ఈ రీసెర్చ్‌లో 0.5 మిల్లీమీటర్ల నుంచి 4.5 మిల్లీమీటర్ల సైజులోనున్న సన్నటి ప్లాస్టిక్ ముక్కలు చేపల బాడీలోకి చొరబడినట్లు తేలింది. ఇవి కేవలం జీర్ణాశయ వరకే కాకుండా, మెల్లగా చేపల మొప్పలు ,కణజాలాల్లోకి (టిష్యూస్) వ్యాపిస్తుండడం చాలా డేంజర్ అని రీసెర్చర్స్ చెబుతున్నారు. నెత్తళ్ల లాంటి చిన్న చేపలు సముద్రపు నీటిలో ఉండే ఆహారాన్ని తినే సమయంలో, నీటిపై తేలియాడే మైక్రోప్లాస్టిక్‌ను కూడా ఫుడ్‌తో పాటు మింగేస్తున్నాయి.

ఇలా ఫుడ్ చైన్ ద్వారా చేపల శరీరంలోకి ప్లాస్టిక్ ప్రవేశిస్తోంది. సాధారణంగా మనం ఇంట్లో చేపలను వండేటప్పుడు జీర్ణాశయం, పొట్ట భాగం, మొప్పలను తీసేసి శుభ్రం చేసే తింటాం కాబట్టి కొంతవరకు ప్రమాదం తప్పొచ్చు. కానీ సావిడాయి వంటి చేపలను ఎండు చేపలను కర్రీ రూపంలో డైరెక్టుగా తింటారు కాబట్టి, వాటిలోని మైక్రోప్లాస్టిక్ మన బాడీలోకి నేరుగా చేరే ప్రమాదం ఉంది.

అయితే ఇది కేవలం సీ ఫిష్‌లకే పరిమితమా.. చెరువుల్లో పెంచే చేపలన్నీ సురక్షితమేనా అంటే.. నిజానికి చెరువు చేపలకు కూడా ఈ ముప్పు ఉంది. మనం వాడే ప్లాస్టిక్ చెత్తంతా వర్షపు నీటితో పాటు కాల్వలు, నదుల ద్వారా సమీపంలోని చెరువుల్లోకే చేరుతోంది. అంతేకాదు చేప(Fish)లకు వేసే ఆర్టిఫిషియల్ ఫీడింగ్, ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరే వాతావరణం వల్ల చెరువు చేపల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ చేరుతున్నట్లు కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు చెప్తున్నాయి.

అలా అని చెప్పి చేప(Fish)లు తినడం మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి గుర్తించిన ప్లాస్టిక్ పరిమాణం మనుషులకు వెంటనే ప్రమాదం కలిగించే స్థాయిలో అయితే లేదు. కానీ, లాంగ్ రన్‌లో బాడీలో ప్లాస్టిక్ కణాలు పేరుకుపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వంటి ముప్పులు వచ్చే అవకాశముంటుంది.

Fish
Fish

ఈ అలారమింగ్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు, ప్రజలు వెంటనే అలర్ట్ అవ్వాలి. సముద్ర తీరాలు, నదుల్లోకి ప్లాస్టిక్ వేస్టేజ్‌లు ఏవీ కలవకుండా ప్రభుత్వాలు పక్కా సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. తీరప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను స్ట్రిక్ట్‌గా బ్యాన్ చేయాలి. అలాగే ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా మార్కెట్‌లోకి వచ్చే ఫిష్ క్వాలిటీపై రెగ్యులర్‌గా చెకప్స్ నిర్వహించాలి.

ఇటు ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అలాగే చేపలను వండుకునేటప్పుడు జీర్ణాశయం, మొప్పలను పూర్తిగా తొలగించి, ఉప్పు,పసుపు వేసిన నీటిలో శుభ్రంగా కడగడం అలవాటు చేసుకోవాలి. ఎండు చేపలను తినే ముందు అయితే మరింత జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. అందుకే పర్యావరణాన్ని మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే, మన ప్లేట్లలోకి వచ్చే ఫుడ్ కూడా సురక్షితంగా ఉంటుందని ఈ హెచ్చరికలు చెబుతున్నాయి.

Ponnaganti Aaku Pachadi : సైట్ ప్రాబ్లెమ్స్‌కి పర్ఫెక్ట్ సొల్యూషన్..టిఫిన్స్, అన్నంలోకి టేస్టీ అండ్ హెల్దీ పొన్నగంటి పచ్చడి రెసిపీ ..

Related Articles

Back to top button