Just LifestyleLatest News

Chicken Pulusu : చికెన్ పులుసు నీళ్లలా అవుతోందా? పక్కా కొలతలతో ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..

Chicken Pulusu : చికెన్ పులుసు నీళ్లలా అయిపోవడం లేదంటే టేస్ట్ సరిగా కుదరకపోవడం వంటివి జరుగుతాయి. అందుకే బాయిలర్ చికెన్‌తో కుక్కర్‌లో ఎంతో ఈజీగా.. పక్కా కొలతలతో హోటల్ కర్రీని మించిపోయేలా చేసే చిక్కటి చికెన్ పులుసు రెసిపీ

Chicken Pulusu

సండే వచ్చిందంటే చాలు చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా ఉంటుంది. అయితే చికెన్ ఫ్రై, చికెన్ పులావ్, చికెన్ గ్రేవీ ఇలా రెగ్యులర్ ఐటెమ్స్ కాకుండా.. ఈసారి చిక్కటి చికెన్ పులుసుతో వేడివేడి రైస్ కలుపుకొని తింటే ఇక అస్సలు వదిలిపెట్టరు.

అయితే చాలామందికి చికెన్ పులుసు(Chicken Pulusu) నీళ్లలా అయిపోవడం లేదంటే టేస్ట్ సరిగా కుదరకపోవడం వంటివి జరుగుతాయి. అందుకే బాయిలర్ చికెన్‌తో కుక్కర్‌లో ఎంతో ఈజీగా.. పక్కా కొలతలతో హోటల్ కర్రీని మించిపోయేలా చేసే చిక్కటి చికెన్ పులుసు రెసిపీని ఇలా ఫాలో అయితే రుచికి రుచి.. చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది.

దీని కోసం కేజీ చికెన్, రెండు టేబుల్ స్పూన్ల కారం, రెండు టీస్పూన్లు సాల్ట్,రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, టీస్పూన్ పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టీస్పూన్ జీలకర్ర పొడి, రెండు దాల్చిన చెక్కలు, నాలుగు యాలకులు, ఐదు లవంగాలు, టీస్పూన్ మిరియాల పొడి, సరిపడా నూనె, గ్లాసున్నర నీళ్లు, 50 గ్రాముల ఎండు కొబ్బరి, 15 జీడిపప్పులు, రెండు పెద్ద ఉల్లిపాయలు, నాలుగు టమోటాలు, నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, టీస్పూన్ గరం మసాలా, రెండు టీస్పూన్లు కసూరి మేతి, కొత్తిమీర తరుగు కావాలి.

ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకుని కుక్కర్‌లో వేయాలి. దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు, పసుపు,కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాల పొడి, గ్లాసున్నర నీళ్లు పోసి కలపాలి.

తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్‌లో ఎండు కొబ్బరి, జీడిపప్పు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. అలాగే టమోటాలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచాలి.

Chicken Pulusu
Chicken Pulusu

ఇప్పుడు వేరే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ తరుగు, పచ్చిమిర్చి ,ఉప్పు, కరివేపాకు, ఫ్లేవర్ కోసం పుదీనా వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మిగిలిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేగనివ్వాలి.

ఆ తర్వాత టమోటా ప్యూరీ, కొబ్బరి,జీడిపప్పు పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. ఈ పేస్ట్ వేగిన తర్వాత కుక్కర్‌లో ఉడికించిన చికెన్‌ను వాటర్‌తో పాటు పోసి కలపాలి. ఉప్పు, కారం సరిపోయాయా లేదా చూసుకుని, గ్రేవీకి తగ్గట్టు నీళ్లు చూసుకుని మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. చివరిగా దించే ఒక్క నిమిషం ముందు గరం మసాలా, కసూరి మేతి వేసి కొత్తిమీర కూడా చల్లుకుంటే నోరూరించే చికెన్ పులుసు(Chicken Pulusu) రెడీ అయిపోయినట్లే.

Ponnaganti Aaku Pachadi : సైట్ ప్రాబ్లెమ్స్‌కి పర్ఫెక్ట్ సొల్యూషన్..టిఫిన్స్, అన్నంలోకి టేస్టీ అండ్ హెల్దీ పొన్నగంటి పచ్చడి రెసిపీ ..

Related Articles

Back to top button