Just SpiritualLatest News

Lionel Messi : 207 మ్యాచ్‌లు, 127 గోల్స్ ప్రయాణానికి ది ఎండ్.. ఫుట్‌బాల్ గాడ్ మెస్సి సంచలన నిర్ణయం

Lionel Messi : ఇంటర్నేషనల్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్నట్లు మెస్సి అధికారికంగా అనౌన్స్ చేశాడు

Lionel Messi

మైదానంలో బంతి తన కాళ్ల దగ్గర ఉంటే విజయం పక్కా అని నమ్మేలా చేసిన అద్భుతం, అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశాడు.

తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన, గుండెను పిండేసే ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశాడు. ఇన్నేళ్ల తన జర్నీలో తనకు అండగా నిలిచిన క్లబ్‌లకు, ప్రతిక్షణం వెన్నుతట్టి ప్రోత్సహించిన ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు.

ఇటీవల ముగిసిన ఫిఫా వరల్డ్ కప్‌లోనే అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున మెస్సి చివరిసారిగా మైదానంలోకి దిగాడు. ఈ టోర్నమెంట్‌లో మెస్సి ఏకంగా 8 గోల్స్ చేసి.. తన అద్భుతమైన ఫామ్‌తో జట్టును ముందుండి నడిపించినా కూడా, ఫైనల్ పోరులో మాత్రం స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.

మెస్సి తన సుదీర్ఘమైన ఇంటర్నేషనల్ కెరీర్‌లో మొత్తం 207 మ్యాచ్‌లు ఆడటమే కాదు.. ఏకంగా 127 గోల్స్ సాధించి రికార్డుల రారాజుగా నిలిచాడు. నిజానికి మెస్సి 2016లోనే ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించినా కూడా, అభిమానుల కోరికతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే మళ్లీ 2026 ఫిఫా ఫైనల్ మ్యాచ్ ముగిసిన 2 రోజుల తర్వాత అంటే జులై 21న తాను ఈ రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు మెస్సి ఇప్పుడు అఫీషియల్‌గా వెల్లడించాడు.

ఈ సందర్భంగా మెస్సి ఇన్​స్టాగ్రామ్‌లో రాసుకొచ్చిన ఎమోషనల్ పదాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. ఇది తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన నిర్ణయమని.. ఈ డిసిషన్ తనను ఎప్పటికీ లోలోపల వేధిస్తూనే ఉంటుందని మెస్సీ రాసుకొచ్చారు.

కానీ, రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన టైమ్‌ అని తాను భావిస్తున్నానన్న మెస్సి.. తన దేశపు జెర్సీ కోసం తన సర్వస్వాన్ని ధారపోశానని గుర్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నానని.. తన దగ్గర ఇవ్వడానికి ఏమీ మిగలలేదని అన్నారు. 20 ఏళ్లుగా తనపై అభిమానులు చూపించిన ప్రేమకు వేల ధన్యవాదాలు చెప్పారు.

Lionel Messi
Lionel Messi

ఇకపై స్టేడియం లోపల ఫ్యాన్స్ గొంతులను వినలేకపోవడం తనను ఎంతగానో బాధిస్తుందని అన్నారు. ఇక నుంచి తాను అభిమానులలో ఒకడిగా మారిపోతానని చెప్పుకొచ్చారు. కష్టసమయాల్లో బయటి నుంచే జట్టుకు ఎప్పుడూ మద్దతుగా నిలబడతానని మెస్సి అన్నారు.

తన కుటుంబానికి, సహచర ఆటగాళ్లకు, కోచ్‌లకు ధన్యవాదాలు చెప్పిన ఆయన.. తన హృదయంలో ఈ జ్ఞాపకాలను భద్రంగా దాచుకుంటానని ఎమోషనల్ అయ్యారు. తనను అర్జెంటీనా వాసిగా పుట్టించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలని.. అర్జెంటీనా వర్ధిల్లాలని అంటూ పోస్ట్ ముగించాడు.

మొత్తంగా మైదానంలో లెజెండరీ ఆటగాడిగా మెస్సి మాయాజాలం..  ఇకపై అభిమానులకు కనిపించకపోయినా, ఆయన సాధించిన రికార్డులు మాత్రం చరిత్ర ఉన్నంత కాలం నిలిచే ఉంటాయన్నది నిజం.

 

View this post on Instagram

 

A post shared by Leo Messi (@leomessi)

Seed Ganesh : నీళ్లలో కరిగే ప్రతిమ కాదు.. ఇంట్లో చెట్టుగా మొలిచే దేవుడు.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై చిరంజీవి స్పెషల్ మెసేజ్..

Related Articles

Back to top button