Just LifestyleLatest News

Breakup Pain : బ్రేకప్ పెయిన్ తగ్గడం లేదా? ఫేక్ ఐడీలతో మాజీలను ట్రాక్ చేస్తున్నారా?

Breakup Pain : ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి వారి డీపీలు, రోజూ పెట్టే వాట్సాప్, ఇన్‌స్టా స్టేటస్‌లు చెక్ చేస్తూ సైలెంట్‌గా ట్రాక్ చేస్తుంటారు.

Breakup Pain

ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి విషయం, ప్రతీ నిమిషం ఎంత మెమరబుల్‌గా అనిపిస్తుందో, బ్రేకప్ అయ్యాక ప్రతి క్షణం అంత చేదు అనుభవంగా మారుతుంది. అయితే ఇక్కడ అసలైన సమస్య బ్రేకప్ అవ్వడం కాదంటారు సైకాలజిస్టులు.. ఆ తర్వాత ఆ మనిషి ప్రవర్తించే మైండ్‌సెట్ తీరే అసలు సమస్య అంటారు.

చాలామంది విడిపోయాక కూడా మాజీ లవర్‌కు పదే పదే కాల్స్ చేయడం, మెసేజ్‌లు పంపడం చేస్తుంటారు. అటువైపు నుంచి బ్లాక్ చేసినా కూడా ..ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి అయినా సరే వారి డీపీలు, రోజూ పెట్టే వాట్సాప్, ఇన్‌స్టా స్టేటస్‌లు చెక్ చేస్తూ సైలెంట్‌గా ట్రాక్ చేస్తుంటారు. వారిచ్చిన గిఫ్ట్‌లు, ఓల్డ్ చాట్స్ అన్నీ చూసుకుని రాత్రంతా కుమిలిపోతుంటారు.

సైకాలజీ ప్రకారం దీనిని ఎమోషనల్ అడిక్షన్ లేదా ఒకరకమైన మానసిక ఆరాటం అని అంటారు. ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు బ్రెయిన్‌లో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజవుతుంది. బ్రేకప్ అవ్వగానే ఆ హార్మోన్ లెవెల్స్ అన్నీ ఒక్కసారిగా పడిపోతాయి.

దాంతో మెదడు మళ్లీ ఆ హ్యాపీనెస్ కోసం ఆరాటపడుతూ మాజీల జ్ఞాపకాల వైపే లాగుతుంది. కానీ, ఇలా పదే పదే పాత జ్ఞాపకాలను త్రవ్వడం మంచిది కాదని మానసిక నిపుణులు అంటున్నారు. దీనివల్ల మీ విలువైన టైమ్‌, ఎనర్జీ వేస్ట్ అవ్వడమే కాకుండా.. మిమ్మల్ని మీరే మానసిక క్షోభకు, యాంగ్జైటీకి, చివరికి క్లినికల్ డిప్రెషన్‌కి కూడా గురి చేసుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు. మీ సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ను మీరే తక్కువ చేసుకుంటున్నారనే నిజాన్ని కూడా ఇక్కడ గుర్తించాలి.

మీరిద్దరూ ఒకసారి బ్రేకప్ నిర్ణయం తీసుకున్నప్పుడు.. కేవలం ఆ వ్యక్తితో మాత్రమే కాదు, వారితో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క విషయానికి కూడా మైండ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ బ్రేకప్ చెప్పి తీరాల్సిందే. అందుకే ముందుగా మాజీల సోషల్ మీడియా అకౌంట్లను అన్‌ఫాలో లేదా బ్లాక్ చేయండి.

Breakup Pain
Breakup Pain

పదే పదే ప్రొఫైల్, స్టేటస్ చెక్ చేసే అలవాటును నో కాంటాక్ట్ రూల్‌తో కంట్రోల్ చేయండి. వారు ఇచ్చిన బహుమతులు కంటికి కనిపించకుండా ఉంచండి. చాట్‌లు,మీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేయండి. ఆ వస్తువులు, జ్ఞాపకాలు మీ కంటిముందు ఉన్నంత కాలం మీ బ్రెయిన్ పాత మెమరీస్‌ను రీవైండ్ చేస్తూనే ఉంటుంది.

ఈ డిప్రెసివ్ లూప్ నుంచి బయటపడాలంటే ముందు మీ సోషల్ సర్కిల్‌ని మార్చాలి. నెగిటివ్ ఆలోచనలను పెంచే ఒంటరితనాన్ని వదిలేసి, పాజిటివ్‌గా ఆలోచించే మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. కొత్త విషయాలు నేర్చుకోవడం, జిమ్ లేదా ఫిట్‌నెస్, హాబీలపై ఫోకస్ పెట్టి..మెదడును కొత్త డోపమైన్ వైపు మళ్లించొచ్చు.

Seed Ganesh : నీళ్లలో కరిగే ప్రతిమ కాదు.. ఇంట్లో చెట్టుగా మొలిచే దేవుడు.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై చిరంజీవి స్పెషల్ మెసేజ్..

Related Articles

Back to top button