Janasena : లోకల్ ఎలక్షన్స్ టార్గెట్.. జనసేనకు ఈసారి కూడా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధ్యమేనా?
Janasena : గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అసెంబ్లీ స్థానాల వరకు కూడా తమ పార్టీని బలపరచడమే టార్గెట్‌గా చేసుకుని జనసేన ఇప్పుడే పక్కా స్కెచ్ అమల్లోకి తీసుకువస్తోంది.
Janasena
ఏపీ పాలిటిక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త స్ట్రాటజీతో దూసుకెళ్తోంది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలను కేవలం స్థానిక పోరుగా మాత్రమే కాకుండా, నెక్స్ట్ అసెంబ్లీ పోరుకు ఒక మెయిన్ రిహార్సల్‌గా భావిస్తోంది.
గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అసెంబ్లీ స్థానాల వరకు కూడా జనసేన పార్టీని బలపరచడమే టార్గెట్‌గా చేసుకుని ఇప్పుడే పక్కా స్కెచ్ అమల్లోకి తీసుకువస్తోంది. ప్రతీ ఒక్క నియోజకవర్గంలో కూడా తమ పార్టీ కేడర్ బలం ఎంత ఉంది? కలిసి వచ్చే నాయకులెవరు? గెలిచే అవకాశాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయనే అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.
దీనిలో భాగంగానే కోఆర్డినేషన్ టీమ్స్, లోకల్ ఎలక్షన్ కోఆర్డినేటర్లతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ సీరియస్ సమావేశాలు పూర్తి చేసింది. సీట్లు ఎక్కువ అడగడం ఇంపార్టెంట్ కాదని, గతంలో లాగే నిలబెట్టిన ప్రతి చోటా గెలవడమే ముఖ్యమనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.
నిజానికి గత అసెంబ్లీ ఎలక్షన్స్‌లో గెలిచాక జనసేన గ్రాఫ్ క్షేత్రస్థాయిలో ఊహించని రీతిలో పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన మార్క్ పాలనలో చూపిస్తున్న అభివృద్ధి, శాఖల నిర్వహణ, వేగంగా డెసిషన్స్ తీసుకునే తీరు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి.
దీంతో కూటమి సర్కార్‌లో పవన్ కళ్యాణ్‌కున్న ప్రజాదరణ, ఇమేజ్ గతంలో కంటే చాలా రెట్లు పెరిగినట్లు క్షేత్రస్థాయిలో టాక్ నడుస్తోంది. మరోవైపు వైసీపీపై ప్రజల్లో నెగిటివిటీ తగ్గకపోవడం జనసేనకు ప్లస్‌గా మారుతోంది. గ్రౌండ్ లెవెల్లో వైసీపీ నుంచి బయటకు వస్తున్న లీడర్లు, కార్యకర్తలు ఎక్కువ శాతం మంది జనసేన వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తుండటం.. పార్టీ బలాన్ని మరింత రెట్టింపు చేస్తోంది.

ఇదే సమయంలో తాజాగా అమలాపురం జనసేన(Janasena) ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, తమ పార్టీ బలాన్ని భారీగా పెంచుకుని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఏకంగా 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసే రేంజ్‌కు జనసేనను తీసుకెళ్తామని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
అలాగే గత ఎన్నికల లాగే స్థానిక పోరులో కూడా హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్ సాధిస్తుందని జనసేన కార్యదర్శి రామ్ తాళ్లూరి చెప్పడం కూడా దీనికి ఊతమిస్తుంది . ఈ లోకల్ ఎన్నికల ఫలితాలు కనుక జనసేన పార్టీకి అనుకూలంగా వస్తే , రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి 50-60 సీట్ల వరకూ పోటీ చేయాలనే పవన్ కళ్యాణ్ ప్లాన్ నెరవేరడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు.
AQP4 Gene : రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా?..నైట్ టైమ్‌లో బ్రెయిన్లో జరిగే ‘జీన్’ కథ తెలుసుకోండి..





