Just LifestyleLatest News

Gas Pipe : మీ ఇంట్లోని గ్యాస్ పైప్ మార్చి ఎన్ని ఏళ్లయ్యింది? ఈ రూల్ తెలుసుకోకపోతే చాలా డేంజర్..

Gas Pipe : గ్యాస్ పైప్ బయటకు ఎంత కొత్తగా కనిపిస్తున్నా.. కంటిన్యూగా గ్యాస్ సరఫరా అవడం వల్ల లోపలి భాగం మెల్లగా బలహీనపడిపోతుంది.

Gas Pipe

ప్రతీ ఇంట్లో గ్యాస్ స్టవ్ వాడటం కామన్ . అయితే చాలామంది గ్యాస్ పైప్ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం వహిస్తుంటాం. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా పైప్‌ను మార్చకుండా అలాగే వాడేస్తూ ఉంటారు. అయితే బయటకు బాగానే కనిపిస్తోంది కదా అని లైట్ తీసుకుంటే, ఏ క్షణంలోనైనా అది ఇంట్లో పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూస్తే.. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు వాడే పైప్ లైఫ్ టైమ్ కేవలం ఐదేళ్లు మాత్రమే. బయటకు ఎంత కొత్తగా కనిపిస్తున్నా.. కంటిన్యూగా గ్యాస్ సరఫరా అవడం వల్ల లోపలి భాగం మెల్లగా బలహీనపడిపోతుంది. అందుకే ఐదేళ్లు పూర్తి కాగానే కచ్చితంగా కొత్త గ్యాస్‌ పైప్‌(Gas Pipe)ను అమర్చాలి. అది కూడా కంపల్సరీగా ఐఎస్‌ఐ (ISI)మార్క్ ఉన్న నాణ్యమైన పైప్‌లను మాత్రమే కొనాలి. కాస్ట్ తక్కువగా ఉన్న పైపులు వాడితే ప్రాణాలకే ప్రమాదమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

మీ గ్యాస్ పైప్‌(Gas Pipe)పై ఎక్కడైనా చిన్న పగుళ్లు, హోల్స్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. అంతేకాకుండా పైప్ చివర్లు గట్టిగా మారిపోవడం, సాగే గుణం కోల్పోయి బిగుసుకుపోవడం వంటివి గమనిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మార్చేయాలి. లేకపోతే గ్యాస్ లీకయ్యి మంటలు చెలరేగి సిలిండర్ పేలే అవకాశాలు కూడా ఉంటాయి.

Gas Pipe
Gas Pipe

అందుకే కొత్త పైప్ బిగించాలనుకున్నప్పుడు ముందుగా రెగ్యులేటర్ నాబ్‌ను పూర్తిగా ఆపేయాలి. స్టవ్, రెగ్యులేటర్ రెండింటికీ కూడా పైప్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యిందో లేదా చూసుకుని, సేఫ్టీ క్లాంప్‌లను గట్టిగా ఫిక్స్ చేయాలి. మీకు ఈ పని చేయడం రాకపోతే.. ఎలాంటి ప్రయోగాలు చేయకుండా మీ గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్ కానీ టెక్నీషియన్ సహాయం కానీ తీసుకోవాలి

Cabbage Storage : ఫ్రిడ్జ్‌లో పెట్టినా క్యాబేజీ కుళ్లిపోతోందా? ఈ చిన్న ట్రిక్ తెలుసుకోండి..

Related Articles

Back to top button