Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss House : బిగ్ బాస్ హౌస్‌లో ట్రయాంగిల్ రచ్చ..షాలినీ ఆటిట్యూడ్‌తో రోహిత్ బలి..

Bigg Boss House : ప్రతిదాంట్లో షాలినీ ఇచ్చే సలహాలు, ఓవర్ పొసెసివ్‌నెస్ వల్ల రోహిత్ సరిగ్గా ఆడలేక లాస్ట్ ప్లేస్‌కు పరిమితమయ్యాడు.

Bigg Boss House

బిగ్ బాస్ రియాలిటీ షో పేరు తలచుకోగానే అక్కడ ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం అన్న మాట వింటుంటాం. ఇక పదో సీజన్‌ గురించి అయితే ఆ మాట ఇంకా చాలాసార్లు వింటాం. బిగ్ బాస్ హౌస్‌(Bigg Boss House)లో రోజులు గడిచేకొద్దీ కంటెస్టెంట్ల మధ్య బయటపడుతున్న ఈగోలు, లవ్ ట్రాక్‌లు, గ్రూపిజాలు పీక్స్‌కి చేరిపోతున్నాయి.

ముఖ్యంగా రోహిత్, షాలినీ, అపూర్వ మధ్య నడుస్తున్న ట్రయాంగిల్ డ్రామా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌(Bigg Boss House)ను రణరంగంగా మార్చేస్తోంది. నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లను సేవ్ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేసిన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, హౌస్‌లోని పాత పగలను, కొత్త కుట్రలను ఒకేసారి బయటకు తీసింది. దీనికోసం జరిగిన నాటకీయ పరిణామాలు, ఎమోషనల్ డ్రామాతో పాటు టాస్క్‌లో అనూహ్యమైన ఓటమి బుధవారం రోజు ఎపిసోడ్‌కే మెయిన్ హైలైట్‌గా నిలిచాయి.

నామినేషన్ల ఘట్టం కంప్లీట్ అయిన వెంటనే హౌస్‌లో పాయింట్ల లెక్కలపై పెద్ద డిస్కషన్ నడిచింది. షాలినీ కత్తుల కోసం గట్టిగా పోరాడిందని, అదే టైమ్‌లో ఝాన్సీ ఇమ్యూనిటీని వద్దనుకుని కత్తులను శాక్రిఫైజ్ చేసిందంటూ అగ్నిపరీక్ష టీమ్‌కి అపూర్వ వివరించడానికి చూసింది.

ఈ మాటలన్నీ వింటున్న రోహిత్, అమన్, చరణ్‌ ఝాన్సీని పక్కన పెట్టుకుని, తను ఈ విషయాలను అవతలి టీమ్‌కి చేరవేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో అసహనానికి గురైన ఝాన్సీ అక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పడం, అమన్ ఆమెతో మాట్లాడటం, ఎదుటివారితో మనం ఉండే బిహేవియర్‌ను బట్టే వాళ్ల ప్రవర్తన కూడా ఉంటుందని ఝాన్సీ క్లారిటీ ఇచ్చింది.

మరోవైపు రామ్ ప్రసాద్, త్రిగుణ్ నరేష్‌తో మాట్లాడుతూ..రెండోసారి ఎంట్రీ ఇచ్చినా కూడా చరణ్ ఇప్పటివరకు ఒక్క టాస్క్ గెలవలేదు కానీ నరేష్ చాలా గెలిచాడని లాజిక్స్ లేపారు. ఇక వర్షిణి తన లైఫ్‌లో దొరకని తండ్రి ప్రేమను తలుచుకుని ముకేష్ చేయి పట్టుకుని కన్నీళ్లతో చెప్పడం, ముకేష్ నుంచి తాను పొందేది కేవలం తండ్రి లాంటి భరోసా మాత్రమేనని త్రిగుణ్‌కు చెప్పి ఎమోషనల్ అయింది.

సరిగ్గా ఇదే టైమ్‌లో బిగ్ బాస్ ఎలిమినేషన్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కి వెళ్లడానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎండిపోయిన చెట్టుపై ఉన్న నామినేటెడ్ కంటెస్టెంట్స్ తమ ఆటతో వికసించిన ట్రీపై ఉన్న దేబ్జానీ, వంశీ, సుధీర్, వర్షిణి ప్లేస్‌లను దక్కించుకోవాల్సి ఉంటుందని ప్రకటించాడు. ఈసారి ఎలిమినేషన్ అనేది కేవలం ఆడియన్స్ ఓట్లతో మాత్రమే కాదని ఈ టాస్క్ రిజల్ట్‌పైనా ఆధారపడి ఉంటుందని చెబుతూ ఇద్దరిద్దరూ పేయిర్‌గా మారాలని ఆదేశించాడు.

ఇక్కడే అసలు పాలిటిక్స్ మొదలైంది. త్రిగుణ్ వెళ్లి అమన్‌ను రమ్మనడంతో.. రోహిత్ మధ్యలో దూరి త్రిగుణ్ నిన్ను రిస్క్‌లోకి నెట్టేస్తున్నాడంటూ అమన్‌కి బ్రెయిన్ వాష్ చేశాడు. ఇక అపూర్వ వచ్చి రోహిత్‌ను పార్ట్‌నర్‌గా రమ్మని అడగ్గా, ఆమెను వెయిట్ చేయమని చెప్పి షాలినీతో కలిసి ఆడటానికి రెడీ అయ్యాడు. గ్రూప్‌లో తనను కనీసం కలుపుకోవడం లేదని అపూర్వ ఫీల్ అవ్వడంతో షాలినీ విరుచుకుపడింది. అసలు మా ఇద్దరి మధ్యలోకి ఎందుకు వస్తున్నావంటూ అపూర్వపైకి దూసుకెళ్లింది.

Bigg Boss House
Bigg Boss House

ఈ వార్‌లోకి త్రిగుణ్, సుధీర్ పేర్లు కూడా రావడంతో అక్కడ అట్మాస్పియర్ మరింత వేడెక్కింది. సుధీర్‌ను తాను మ్యారేజ్ చేసుకుంటానని సరదాగా అన్న మాటను పదే పదే సీరియస్ చేయడంపై అపూర్వ బాగా ఏడ్చేసింది. ఈ గొడవల తర్వాత జరిగిన మొదటి టాస్క్‌లో అపూర్వ చరణ్ జోడీ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, త్రిగుణ్ అమన్ సెకండ్ ప్లేస్‌ను, ముకేశ్ ఝాన్సీ మూడో స్థానాన్ని, నరేష్ రామ్ ప్రసాద్ ప్లేస్‌ను సాధించుకున్నారు.

కానీ ప్రతిదాంట్లో షాలినీ ఇచ్చే సలహాలు, ఓవర్ పొసెసివ్‌నెస్ వల్ల రోహిత్ సరిగ్గా ఆడలేక లాస్ట్ ప్లేస్‌కు పరిమితమయ్యాడు. దీంతో షాలినీ రోహిత్ జోడీ ఫస్ట్ గేమ్‌లోనే దారుణంగా ఓడిపోయింది. అదే సమయంలో రోహిత్ ఒకప్పుడు తనతో క్లోజ్‌గా ఉండేవాడని చరణ్ అనడంతో..దాంతో నా వల్లే అని అంటున్నావా అంటూ షాలినీ మళ్లీ అలిగి హడావుడి చేసింది. ఇలాంటి హై డ్రామా మధ్య హీటెక్కిన బిగ్ బాస్ హౌస్‌(Bigg Boss House)లో నరేష్ తన రాజు సామ్రాజ్యం స్టోరీతో, వర్షిణితో కలిసి చేసిన టైటానిక్ స్పూఫ్‌తో కాసేపు నవ్వులు పూయించి ఎపిసోడ్‌ను బ్యాలెన్స్ చేశారు.

Smoking Zones : యూత్‌ను బలి తీసుకుంటున్న స్మోకింగ్ జోన్లు.. కాఫీ కేఫ్‌ల వద్ద పెరిగిపోతున్న స్మోకింగ్ క్రేజ్..

Related Articles

Back to top button