Fake Promotions : బెస్ట్ డాక్టర్ రూల్స్‌కి చెక్..సోషల్ మీడియాలో ఫేక్ ప్రమోషన్లకు చెల్లు..
Fake Promotions : డాక్టర్లు కేవలం తమ నేమ్, క్వాలిఫికేషన్, రిజిస్ట్రేషన్ నెంబర్ , కన్సల్టేషన్ ఫీజు వివరాలను మాత్రమే డిజిటల్‌గా పంచుకోవాలి. పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్లాసెస్ చెప్పినప్పుడు హాస్పిటల్ బ్రాండింగ్ చేయకూడదు.
Fake Promotions
సోషల్ మీడియా జోరు పెరిగాక ప్రతీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో 100 శాతం గ్యారంటీ క్యూర్, బెస్ట్ డాక్టర్ ఇన్ ది సిటీ అంటూ అందరినీ ఆకర్షించే కార్పొరేట్ హాస్పిటల్స్ , ఫేమస్ డాక్టర్ల ప్రమోషన్లకు ఇక పూర్తిగా చెక్ పడబోతోంది. జనాల అనుమానాలను, భయాలను ఆసరాగా చేసుకుని బిజినెస్ చేసే ధోరణిపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) సీరియస్ యాక్షన్ తీసుకుంది.
సుప్రీంకోర్టులో దాఖలైన ఒక రిట్ పిటిషన్ ఆధారంగా రియాక్ట్ అయిన ఎన్ఎమ్సి ఎథిక్స్ బోర్డు, వెంటనే అమల్లోకి వచ్చేలా కొత్తగా స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. డాక్టర్లు తమ ప్రాఫిట్ కోసం ఫేక్ ప్రమోషన్స్(Fake Promotions) చేయడం చట్టరీత్యా నేరమని బోర్డు కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్ వెల్లడించారు.
ఈ కొత్త రూల్స్ ప్రకారం డాక్టర్లు సోషల్ మీడియా వేదికగా ఫేక్ లైక్స్, ఫేక్ ఫాలోవర్స్‌ను పెంచుకోవడం, పేషెంట్ల ఫోటోలను బిఫోర్..ఆఫ్టర్ పేరుతో కమర్షియల్‌గా వాడుకోవడం, డిస్కౌంట్లు లేదా రిఫరల్ ఫీజుల పేరుతో వారిని ఆకర్షించడంపై పూర్తి బ్యాన్ విధించారు.
అంతటితో ఆగకుండా, ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి పేషెంట్ల ఫేస్‌లు లేదా వాయిస్‌లను క్రియేట్ చేసి యాడ్స్ ఇస్తే తీవ్రమైన క్రిమినల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ మెడికల్ రీసెర్చ్ లేదా సైన్స్ కేస్ స్టడీస్ కోసం పేషెంట్స్ ఫోటోలు వాడాల్సి వస్తే, తప్పనిసరిగా వారి పర్మిషన్ తీసుకోవడంతో పాటు ఫేస్ గుర్తు పట్టకుండా కవర్ చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్ల(Fake Promotions) బాధ్యత థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్లకు ఇచ్చినా, దానిలో తప్పులు దొర్లినా డైరెక్టుగా డాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఈ రూల్స్ ఉల్లంఘించినట్లు తేలితే ఫస్ట్ టైమ్ వార్నింగ్ ఇస్తారు. కానీ పదే పదే అదే తప్పు చేస్తే మెడికల్ రిజిస్టర్ నుంచి 1 – 3 ఏళ్ల పాటు వారి రిజిస్ట్రేషన్‌ను తొలగించే ఛాన్స్ ఉంది. అలాగే చీటింగ్ చేసిన మోసపూరిత క్లెయిమ్స్ పెద్దవి ఉంటే 6 – 12 నెలల పాటు ప్రాక్టీస్ చేయకుండా డాక్టర్లపై సస్పెన్షన్ వేటు పడుతుంది.

డాక్టర్లు కేవలం తమ నేమ్, క్వాలిఫికేషన్, రిజిస్ట్రేషన్ నెంబర్ , కన్సల్టేషన్ ఫీజు వివరాలను మాత్రమే డిజిటల్‌గా పంచుకోవాలి. పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్లాసెస్ చెప్పినప్పుడు హాస్పిటల్ బ్రాండింగ్ చేయకూడదు.
అయితే ఈ రూల్స్ కేవలం అల్లోపతి డాక్టర్లకు మాత్రమే వర్తిస్తాయని, ఆయుర్వేద, హోమియోపతి డాక్టర్లకు వర్తించవని ఎన్ఎమ్సీ పేర్కొంది. పేషెంట్ల నమ్మకాన్ని కాపాడటానికి, మెడికల్ ఫీల్డ్ బిజినెస్ మయం కాకుండా అడ్డుకోవడానికి ఈ డెసిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.





